ఫుడ్ విల్లా హోటల్ సీజ్ చేయాలి సిపిఎం
* పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం
* ప్రజలకు ఇబ్బందిగా ఉంది
* సిపిఎం పార్టీ డిమాండ్
వికారాబాద్ : వికారాబాద్ జిల్లాలోని కోర్టు ముందు ఉన్న ఫుడ్ విల్లా హోటల్ వెంటనే సీజ్ చేయాలని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. ఈ హోటల్ ప్రారంభించిన నుంచి వ్యర్థ పదార్థాలు,మల మూత్రాలు,మురుగునీరు,కాలనీ రోడ్ల పైన పారుతున్నాయి.పలు దఫాలుగా మున్సిపల్ అధికారులకు ఫిర్యాదులు చేసిన పై సమస్య పరిష్కారం కాలేదు.హోటల్ యజమానిని అడగగా నాలుగు లక్షల రూపాయలు మున్సిపల్ అధికారులకు చెల్లించాము మా దగ్గర రిసిప్ట్ కూడా ఉన్నది.హోటల్ యజమానులు చెబుతున్న పరిస్థితి ఉంది.ఈ హోటల్ వల్ల దుర్గంధంతో చుట్టుపక్కల ఉండడానికి ఇబ్బంది పడుతున్నారు.
దయచేసి మున్సిపల్ అధికారులు కలెక్టర్ మేడం ఎమ్మెల్యే గారు స్పందించి వెంటనే ఈ హోటల్ పై తగు చర్యలు తీసుకొని ఈ హోటల్ లో వెంటనే సీజ్ చేయాలని కోరుతున్నాంలేనియెడల సిపిఎం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని తెలియజేస్తున్నాం. పై కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి పి.మల్లేష్,జిల్లా కమిటీ మెంబర్ ఎం.సుదర్శన్,గిరిజన సంఘం జిల్లా అధ్యక్షుడు జే.శ్రీనివాస్,కెపిఎస్ జిల్లా కార్యదర్శి మైపాల్,సిఐటియు జిల్లా అధ్యక్షులు రామకృష్ణ,జిల్లా నాయకుడు లక్ష్మయ్య గణేష్ తదితరులు పాల్గొన్నారు.