ఘన వ్యర్ధాల నిర్వహణపై అవగాహన కార్యక్రమం
కొత్తగూడెం : నిమ్మలగూడెం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఘన వ్యర్ధాల నిర్వహణపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ITC MSK WASH భద్రాచలం ఎన్జీవో ఆర్గనైజేషన్ వారిచే కోఆర్డినేటర్ డి.వెంకట్రావు గారి ద్వారా సోమవారం నాడు నిమ్మలగూడెం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఆచార్య డాక్టర్ మద్దెల శివకుమార్ అధ్యక్షతన సర్పంచ్ శ్రీ బండి రమేష్ పంచాయతీ కార్యదర్శి శ్రీ ఇజహెద్ గౌరవ అతిథులుగా పరిసరాల పరిశుభ్రత ఘన వ్యర్ధాల నిర్వహణపై అవగాహన సమావేశం నిర్వహించబడినది.
కోఆర్డినేటర్ డి.వెంకట్రావు విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ తరగతి గదిలోని మరియు పాఠశాలలోని చెత్తను చెత్త కుండీలలో వేసి ఎప్పటికప్పుడు పంచాయతీ ఆఫీస్ వారి చెత్త బండికి చేరవేయాలని.తడి చెత్తను బ్లూ డస్ట్ బిన్ లో వేయాలని పొడి చెత్తను గ్రీన్ డస్ట్ బిన్ లో వేయాలని ప్రమాదకరమైన చెత్తను ఎప్పటికప్పుడు తీసివేసి స్వీపర్ ద్వారా చెత్త బండికి చేరవేయాలని విద్యార్థులు ఎల్లప్పుడూ పరిశుభ్రతను పాటించాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు ఆచార్య డాక్టర్ మద్దెల శివకుమార్ మాట్లాడుతూ విద్యార్థులందరూ వ్యక్తిగత పరిశుభ్రత తరగతి గది పరిశుభ్రతతో పాటు పాఠశాల పరిశుభ్రతను కూడా ఎప్పటికప్పుడు పరిరక్షించాలని.భోజన సమయంలో సబ్బుతో శుభ్రంగా చేతులు కడుక్కొని తిరిగి భోజనం అయినాక ఏవైనా మిగిలిన పదార్థాలు ఉంటే వాటిని డస్ట్ బిన్ లో వేసి మళ్లీ సబ్బుతో శుభ్రంగా చేతులు కడుకోవాలని.తరగతి గదిలోని పాఠశాల ఆవరణంలోని చెత్తను ఎప్పటికప్పుడు డస్ట్ బిన్లలో వేయాలని ఇంట్లో కూడా పరిశుభ్రతను పాటించాలని.ప్రతిరోజు స్నానం చేసి పరిశుభ్రమైన ఉతికిన దుస్తులు ధరించాలని అప్పుడే ఆరోగ్యమే మహాభాగ్యం అన్న పెద్దల సూక్తులు నెరవేరుతాయని మనం పరిశుభ్రంగా ఉన్నప్పుడే ఆరోగ్యంగా ఉండగలుగుతామని ఆరోగ్యంగా ఉన్నప్పుడే బాగా చదవగలుగుతామని.విద్యార్థులకు ఉద్బోధించారు.అనంతరం అందరికీ స్వీట్లు బిస్కెట్లు చాక్లెట్లు పంపిణీ చేశారు.
ఈ అవగాహన కార్యక్రమంలో కోఆర్డినేటర్ డి వెంకట్రావు సర్పంచ్ శ్రీ బండి రమేష్,పంచాయతీ కార్యదర్శి శ్రీ ఇజ హెద్ ప్రధానోపాధ్యాయులు ఆచార్య డాక్టర్ మద్దెల శివకుమార్ పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ శ్రీమతి టి రజిత సహా ఉపాధ్యాయులు ఎండి షఫీ అహ్మద్ విద్యా కమిటీ సభ్యులు శ్రీ బండి రమేష్ గ్రామ పెద్దలు శ్రీ బండి వెంకన్న లావణ్య రాధ నరేందర్ విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులు మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.