డబల్ బెడ్ రూం పేద ప్రజలకు అందాలి
లక్ష్మీదేవిపల్లి : లక్ష్మీదేవిపల్లి మండలం ఉమ్మడి చాతకొండ గ్రామ పంచాయతీలో మాజీ మంత్రివర్యులు కొత్తగూడెం అభివృద్ధి ప్రదాత పేదల పెన్నిధి గౌరవనీయులైన ఎమ్మెల్యే శ్రీ వనమా వెంకటేశ్వరరావు గారి ఆదేశానుసారం సాటివారిగూడెం గ్రామపంచాయతీ యందు నిర్మించిన డబల్ బెడ్ రూం గృహములను సర్పంచ్ పూనెం సంద్య అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఎంఆర్ఓ నాగరాజు మండల కో ఆప్షన్ సభ్యులు జక్కుల సుందర్ రావు ఆత్మ కమిటీ డైరెక్టర్ శేషాద్రి వినోద్ ఆర్.ఐ.రాంబాబు పంచాయతీ సెక్రెటరీ శివాని వీరి సమక్షంలో లబ్ధిదారులకు డ్రా తీయడం జరిగినది.లబ్ధిదారులు ఈ డబల్ బెడ్ రూమ్ డ్రా ద్వారా వచ్చిన గృహములను ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా త్వరలో ప్రారంభించబడును ఈ సందర్భంగా లబ్ధిదారులు సీఎం కెసిఆర్ గార్కి ఎమ్మెల్యే వనమా గారికీ హర్షం వ్యక్తం చేశారు.
వార్డ్ ప్రజలతో కౌన్సిలర్ మాధ సత్యావతి
21 వార్డులో అంగన్వాడీ కేంద్రంలో వార్డ్ కౌన్సిలర్ మాధ సత్యావతి గారి ఆధ్వర్యంలో గర్భిణీ స్త్రీలకు శ్రీమంతము చేశారు.వార్డ్ కౌన్సిలర్ మాట్లాడుతూ గర్భిణీలు తీసుకోవలసిన జాగ్రత్తలు మరియు పౌష్టికాహారం గురించి వివరించారు.అంగన్వాడీ టీచర్ మంజుల వార్డ్ ప్రజలు పాల్గొన్నారు.