రెత్తు అన్న కష్టం పై జాలి దయ లేదు
పంట చేతికి వచ్చే టైంలో పకృతి వైపరీత్యాలు మొదలవుతాయి వర్షాలు వస్తాయి.ఇవన్నీ దాటుకొని ఎండి తడిచి ఆరబెట్టి మార్కెట్ కి తీసుకువెళ్లితే తడిచిన దాన్యం మొక్కలు మొలిచాయని వంద కారణాలు చేప్పీ దళారులు కనీస మద్దతు ధర ఇవ్వకుండా సగం ధరకే తీసుకుంటాం లేకపోతే తీసుకెళ్ళమని మోసం చేస్తారు.మార్కెట్ నుండి ఇంటికి రాగానే అప్పులు ఇచ్చిన వాళ్ళు వేధింపులు.చేసిన కాయకష్టానికి తెచ్చిన అప్పులకి. అమ్మిన రేటుకి సరిపోక నరక వేతనం అనుభవించి మెడకి ఉరితాడు దిక్కయినట్లు పురుగుల మందు అమృతమైనట్లు ఆత్మ హత్యకు పాల్పడి ప్రాణాలు కోల్పోతున్నారు.
పకృతి మోసం చేసి ప్రభుత్వాలు మోసం చేస్తుంటే రైతుల ఎలా బ్రతకాలి ఎవరు భరోసా ఇవ్వాలి.పై స్థాయికి ఎదిగిన ప్రతి ఒక్క వ్యక్తి తను స్టేజిపై ఎక్కినప్పుడు మొట్టమొదటి స్పీచ్ ఏమీ ఇస్తారో తెలుసా నేను సామాన్య రైతు కుటుంబంలో పుట్టి పెరిగి కష్టనష్టాలనుభవించి ఈ స్థాయికి చేరుకున్నానని చెప్తారు తప్పితే.అదే రైతు కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులు అప్పులు బాధలతో ఆత్మహత్య చేసుకుంటా ఉంటే కనీసం స్పందన ఉండదు.తనవంతు సహకరించి సహాయం చేసేది ఉండదు.ప్రకృతి వైపరీత్యాలకు మనం ఏమి చేయలేం కానీ.ప్రభుత్వాలను ప్రశ్నించి రైతుల కష్టాలను గుర్తించి వారికి సరైన కనీసం మద్దతు ధర ఇప్పిచ్చి వారిని ఆదుకోవాలని డిమాండ్ చేద్దాం ప్రభుత్వాలను అధికారులను.