కుమారులతో బ్రతికే కన్నా... వృద్దురాలు సజీవదహనం
బషీరాబాద్ : కుమారులతో బ్రతికే కన్నా చావడం మేలు అనుకొని కిరోసిన్ తో నిప్పంటించుకొని మృతి చెందిన ఘటన వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం మైల్వార్ గ్రామంలో చేటు చేసుకుంది. బషీరాబాద్ ఎస్ఐ విద్యాచరణ్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం మంగళవారం రోజున ఉదయం 09:00 am గంటల సమయంలో మైల్వార్ గ్రామానికి చెందిన ముక్త నర్సింలు తండ్రి వీరయ్య గారి తల్లి అయినా శాంతమ్మ తన ఇంటి ఆవరణలో కాలిన గాయాలతో చనిపోయి ఉన్నదని ఫిర్యాదు రాగా వెంటనే బషీరాబాద్ ఎస్ఐ మరియు సిబ్బందితో కలిసి ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించగా తేదీ 21.11.2022 సోమవారం రాత్రి 8 గంటల సమయంలో మృతురాలు అయిన శాంతమ్మ గ్రామస్తులతో మాట్లాడి ఇంటిలోకి వెళ్ళింది.
మంగళవారం నాడు తన ఇంటి ముందు ఆవరణలో కాలిన గాయాలతో చనిపోయి ఉన్నదని మృతురాలు చిన్న కొడుకు అయినా నరసింహులు సమాచారం తెలియగా నరసింహులు వెంటనే మైల్వార్ గ్రామానికి వచ్చి చూడగా తన ఇంటి ముందు ఆవరణలో తన తల్లి అయిన శాంతమ్మ కాలిన గాయాలతో చనిపోయి ఉన్నది.
పరిశీలిస్తున్న డాక్టర్,ఎస్ఐ
మృతురాలు అయినా శాంతమ్మ తన ఆరోగ్య పరిస్థితి బాగాలేనందున మరియు కంటిచూపు మందగించడంతో శాంతమ్మ అప్పుడప్పుడు తన కుమారులతో ఈ బ్రతుకు బ్రతికే కన్నా చావడం మంచిదని చెప్పుకొని బాధపడేది.
తన కుమారులు మృతురాలికి నచ్చ చెప్పిన వినిపించుకునేది కాదు.మృతురాలి ఆరోగ్య పరిస్థితి బాగలేక మరియు కంటిచూపు మందగించడంతో తన జీవితంపై విరక్తి చెంది తన ఒంటిపై కిరోసిన్ పోసుకొని దీపంతో ముట్టించుకుని చనిపోయింది.