రేపే పరాజితుల పండుగ రోజు
సాధారణ ప్రజలు అసాధారణ లక్ష్యాలు ఛేదించడం నేడు సర్వసాధారణం అయ్యింది. నేనెవరికీ తక్కువ కాదని ప్రపంచ రికార్డులు సైతం తలవంచేలా చరిత్రలు సృష్టించిన పరాజితుల పండుగ రోజు ప్రతిజ్ఞ దివస్.నూతన విద్యా విప్లవవేత్త, స్వేరోస్ సృష్టికర్త డా౹౹ R.S ప్రవీణ్ కుమార్ Ex. IPS(Addl DGP) గారు ఏర్పాటు చేసిన స్వేరోస్ నెట్ వర్క్ ,సిద్ధాంతాలు,నియమాలు పేద విద్యార్థుల విజయాలకు పునాదులయ్యాయి.అందుకే నవంబర్ 23 తారీఖున డా.RSP గారి పుట్టినరోజు సందర్భంగా స్వేరోలంతా ప్రతిజ్ఞ దివస్ గా ప్రతియేటా ఘనంగా జరుపుకుంటున్నారు.రేపు కరీంనగర్ జిల్లాలో జరగబోయే ప్రతిజ్ఞ దివస్ వేడుకల్లో పాల్గొందాం నవ భారత నిర్మాణానికి బాటలు వేద్దాం.
దివ్యాంగులకు ఉచిత శిక్షణ
హైదరాబాద్ : అసోసియేషన్ ఆఫ్ పీపుల్ విత్ డిసెబిలిటీ (ఏపీడీ) సంస్థ సహకారంతో ఎంఎస్ ఆఫీస్,రిటైల్ అండ్ ఈ కామర్స్ తదితర విభాగాల్లో దివ్యాంగులకు ఉచిత శిక్షణనిస్తామని అభిశ్రీ ఫౌండేషన్ ఓ ప్రకటనలో తెలిపింది.45 రోజుల శిక్షణతోపాటు ఉద్యోగావకాశాలను కల్పించనున్నట్టు వెల్లడించింది.10వ తరగతి పాసైన లేదా ఇంటర్,డిగ్రీ ఫెయిలైన 35 ఏండ్లలోపు దివ్యాంగ అభ్యర్థులు ఈ నెల 25లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. వివరాలకు 8008861623,9959723268 నంబర్లలో సంప్రదించాలని కోరింది.