దీప నర్సింలు హామీతో కార్మికుల నిరాహార దీక్ష విరమణ‼️
- కాంట్రాక్టు కార్మికులకు భరోసా నింపిన వైస్-చైర్ పర్సన్ పట్లోళ్ల దీప నర్సింలు
తాండూర్ : తాండూరు మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెంచిన పిఆర్సీ,మరియు వారి వేతనాల కొరకై పాత మున్సిపాలిటీ భవనం ఎదురుగా గత 20 రోజులుగా విధులను బహిష్కరించి చెప్పటిన దీక్షకు తాండూరు మున్సిపల్ వైస్-చైర్ పర్సన్ శ్రీమతి. పట్లోళ్ల దీప నర్సింలు పలుమార్లు వారికి సంఘీభావంగా దీక్షకు మద్దతు తెలుపుతూ కార్మికులతో చర్చలు జరిపారు.పిఆర్సీ అమలు విషయమై ఎజెండా కోర్టుకెక్కడం మరియు ప్రిన్సిపాల్ సెక్రటరియట్ పరిధిలో ఉన్నందున గౌరవ తాండూరు శాసనసభ్యులు శ్రీ.పైలెట్ రోహిత్ రెడ్డి గారి ఆదేశానుసారం మున్సిపల్ కాంట్రాక్టు కార్మికుల కష్టాలను వైస్-చైర్ పర్సన్ దీప నర్సింలు గారు చేర్చించి ప్రత్యేక చోరవ చూపించడంతో కార్మికులు ఆమె హామీ మేరకు మంగళవారం దీక్షను విరమించారు.
ఈ సందర్భంగా వైస్-చైర్ పర్సన్ దీప నర్సింలు గారు మాట్లాడుతూ తాండూరు స్వచ్ఛత విషయంలో ప్రతిరోజు పారిశుద్ధ్య కార్మికులు కష్టపడి పనిచేస్తున్నారని.కొంత మంది వారి వ్యక్తిగత రాజకీయస్వలాబా లబ్దికోసం మున్సిపల్ బడ్జెట్ ఎజెండాను కోర్టుకు లాగడం వార్డులలో అభివృద్ధి కుంటుపడడానికి ప్రదానకారణమన్నారు.కాంట్రాక్టు కార్మికుల విషయంలో కూడా పీఆర్సీకి అడ్డుపడ్డవారే అభయాహస్తం ఇచ్చినట్టు చూపిన సవతిప్రేమ చెప్పిన కల్లిబొల్లి మాటలు ప్రజానీకం నమ్మబోదన్నారు.
తన మాటను గౌరవించి దీక్షను విరమించిన మున్సిపల్ కాంట్రాక్టు కార్మికులకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని వారి విధులకు ఎలాంటి ఆటంకం కలగకుండా పెంచిన పీఆర్సీ మరియు వేతనాలను సక్రమంగా అందించే విషయంలో ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి గారి సహకారంతో కార్మికులకు న్యాయం జరిగేలా కృషి చేస్తామన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ రాజు గౌడ్,కౌన్సిలర్లు సంగీత ఠాకూర్,విజయదేవి, అస్లాం,మంకల్ రాఘవేందర్,భీంసింగ్,ముక్తర్ నాజ్,సోమశేకర్,ప్రభాకర్ గౌడ్ తదితరులున్నారు.