మల్లికార్జున స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు
* ఆధ్యాత్మిక చింతనతోనే మానసిక ప్రశాంతత
* మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విఠల్ నాయక్
తాండూరు : వికారాబాద్ జిల్లా తాండూరు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విట్టల్ నాయక్ కుటుంబ సమేతంగా శ్రీశైలం శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు.కార్తీక మాసం చివరి సోమవారం సందర్భంగా శ్రీశైలంలో జ్యోతిర్లింగంగా కొలువుదీరిన భ్రమరాంబ మల్లికార్జున స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి అభిషేకించారు.అనంతరం ఆలయ ప్రాంగణంలో కార్తీక దీపాలను భార్య కిష్టమ్మ కూతురు ప్రశాంతి తో కలిసి కుటుంబ సమేతంగా కార్తీక దీపాలను వెలిగించారు.అదేవిధంగా సాక్షి గణపతిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి హోమం నిర్వహించి దర్శించుకున్నా.ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వేదమంత్రోచరణతో ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు అందజేశారు.