నేను మాటల మనిషిని కాదు చేతల మనిషిని ఎమ్మెల్యే
- అండర్ బ్రిడ్జ్ వరద నీటి తరలింపు కాలువ పనులను పరిశీలించారు
- సుమారు 50 లక్షల రూపాయలతో నిర్మాణం
- పనులలో అలసత్వం,నాణ్యత పాటించకుంటే చర్యలు
- కాంట్రాక్టర్,అధికారులను హెచ్చరిక
కొత్తగూడెం : మంగళవారం రోజున 35 వార్డ్ లో సుమారు 50 లక్షల రూపాయలతో అండర్ బ్రిడ్జి వరద నీటి తరలింపు కాలువ నిర్మాణ పనులను పరిశీలించి, నాణ్యతను చెక్ చేసిన గౌరవనీయులు కొత్తగూడెం ఎమ్మెల్యే శ్రీ వనమా వెంకటేశ్వరరావు గారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే వనమా మాట్లాడుతూ నిర్మాణం లో నాణ్యత పాటించకుంటే కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకుంటానని, త్వరగా కాలువ నిర్మాణ పనులు పూర్తి చేయాలని, పనుల్లో అలసత్వం వహిస్తే సహించేది లేదని అధికారులకు హెచ్చరించిన ఎమ్మెల్యే వనమా.
తుది శ్వాస వరకు ప్రజలకు సేవ చేయడమే నా లక్ష్యం
- జంట నగరాలుగా అభివృద్ధి చేయడమే నా లక్ష్యం ఎమ్మెల్యే
- కొత్తగూడెం మున్సిపాలిటీలో విస్తృతంగా పర్యటణ
- కొత్తగూడెం మున్సిపాలిటీలోని 24,32,20,21,35,2 వార్డ్ లో
- సుమారు 3.00 కోట్ల రూపాయల నిధులతో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన
కొత్తగూడెం మున్సిపాలిటీలోని 24,32,20,21,35,2 వార్డులలో 14th ఫైనాన్స్,డీఎంఎఫ్ నిధులు సుమారు 3.00 కోట్ల రూపాయలతో డ్రైన్ లకు,సీసీ రోడ్లుకు ఎమ్మెల్యే శ్రీ వనమా వెంకటేశ్వరరావు శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే వనమా మాట్లాడుతూ కొత్తగూడెం నియోజకవర్గం అభివృద్ధిలో వనమా పేరు చిరస్థాయిగా ఉండేవిధంగా అభివృద్ధి చేస్తానని,నా తుది శ్వాస వరకు నియోజకవర్గ ప్రజలకు సేవ చేయడమే నా లక్ష్యం అని అన్నారు.
ఈ యొక్క కార్యక్రమంలో శ్రీ వనమా రాఘవేందర్ గారు మున్సిపల్ చైర్ పర్సన్ కాపు సీతా లక్ష్మి,మున్సిపల్ వైస్ చైర్మన్ దామోదర్ యాదవ్, మార్కెట్ కమిటీ చైర్మన్ బుక్యా రాంబాబు, ఉర్దూగర్ కమిటీ చైర్మన్ అన్వర్ పాషా,కౌన్సిలర్లు బాలిశెట్టి సత్యభామ,కంభంపాటి లీలారాణి,అజ్మీర సుజాత, మాదా సత్యవతి,రుక్మందర్ బండారి,అంబుల వేణు,కోలాపురి ధర్మరాజు, విజయ్,పరమేష్ యాదవ్,పలపు లక్ష్మణ్,వేముల ప్రసాద్, బండి నరసింహా,కో ఆప్షన్ సభ్యులు దూడల బుచ్చయ్య, జక్కుల సుందర్ టిఆర్ఎస్ నాయకులు MA రజాక్,యూసుఫ్,సుందర్ రాజ్, కంభంపాటి దుర్గాప్రసాద్, పూర్ణ, దూడల కిరణ్, క్లాసిక్ రమణ, మాదా శ్రీరాములు, 22వ వార్డు యాకూబ్, తాండ్ర శీను, సాంబార్ రెడ్డి, కుసపాటి శ్రీను, బోడ గణేష్, బొంకూరు పరమేష్, గుండా రమేష్, అశోక్, మున్నా, ఈశ్వర్, గాయత్రి, సృజన, కర్రీ అపర్ణ, శేషాద్రి వినోద్, సర్పంచ్ రతన్ నాయక్, ముత్యాల రాజేష్, క్లాసిక్ దుర్గ, దూడల కిరణ్, సందీప్, రజనీకాంత్, పవన్, మరియు స్థానిక టిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, వార్డు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
బాధలో ఉన్నవారిని ఆదరించాలి
శ్రీనగర్ ఉప సర్పంచ్ లగడపాటి రమేష్ తండ్రి గారి ఆరోగ్యం బాగోలేదని తెలుసుకుని డాక్టర్ నాగరాజు హాస్పిటల్ కి వెళ్లి లగడపాటి రమేష్ తండ్రి గారిని పరామర్శించి డాక్టర్ నాగరాజు గారిని రమేష్ గారి నాన్నగారి ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకుని మెరుగైన వైద్యసేవలు అందించాలని సూచించిన కొత్తగూడెం శాసనసభ్యులు గౌ శ్రీ వనమా వెంకటేశ్వరరావు,యంగ్ డైనమిక్ లీడర్ వనమా రాఘవన్న,మరియు తాళ్ళురి వెంకటేశ్వరావు మరియు ఉర్దూ ఘర్ చైర్మన్ అన్వర్ పాషా,ఆత్మ కమిటీ డైరెక్టర్ శేషాద్రి వినోద్,లక్ష్మీదేవిపల్లి మండల కొ ఆప్షన్ సభ్యులు జక్కుల సుందర్,ఉర్దూ ఘర్ కమిటీ సభ్యులు యాకూబ్ పాష తదితరులు పాల్గొన్నారు.