మానవత్వంతో ప్రతి ఒక్కరు ఆదరించాలి
కొత్తగూడెం : దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా సుదీర్ఘకాలంగా తమకు అండగా నిలిచి ఆదరిస్తున్న ఆచార్య డాక్టర్ మద్దెల శివ కుమార్ ను ఘనంగా సత్కరించి అభినందించిన కళ్యాణ్ సుమిత్ర ఎంటర్టైన్మెంట్స్ అధినేతలు దివ్యాంగులు కళ్యాణ్ మరియు సుమిత్ర.దివ్యాంగులను మానవత్వంతో ప్రతి ఒక్కరు ఆదరించి అక్కున చేర్చుకుని ప్రోత్సహించి అండగా నిలబడాలి.
ఈ సమాజంలో ఆదరణ లేక వివక్షతకు పీడనకు గురి అవుతూ అవమానాలు పొందుతున్న దివ్యాంగులను మానవత్వంతో ఆదరించి అక్కున చేర్చుకోవాలని ప్రేమ జాలి దయ చూపి వారిని ప్రోత్సహిస్తూ వారికి అండగా నిలవాలని అప్పుడే ఉత్తమమైన ఈ మానవ జన్మకు సార్థకత అని నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుమని బైబిల్ గ్రంధం చెప్పిన మానవసేవే మాధవసేవని భగవద్గీత చెప్పిన ఈ సమాజంలోని అనాధలను విధవరాంట్లను ప్రేమించి ఆదరించాలని ఖురాన్ చెప్పిన పే బ్యాక్ టు ద సొసైటీ అని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పిన ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్నాని మదర్ తెరిసా చెప్పిన సొంత లాభం కొంత మానుకో పొరుగు వానికి తోడు పడవోయ్ అని గురజాడ చెప్పిన నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చానని శ్రీశ్రీ గారు చెప్పిన అందరి సందేశం ఒక్కటేనని అతి పేద వారిని అభాగ్యులను దివ్యాంగులను ఆదరించాలని అభ్యుదయ కళా సేవా సమితి జిల్లా అధ్యక్షులు కవి సినీగీత రచయిత గాయకులు సమాజసేవకులు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ హోల్డర్ ఆచార్య డాక్టర్ మద్దెల శివకుమార్ ఉద్ఘాటించారు.
కళ్యాణ్ సుమిత్ర ఎంటర్టైన్మెంట్స్ పేరిట ఒక డాన్స్ అకాడమీ ని నడుపుతూ దివ్యాంగులు అయినా కూడా ఆత్మవిశ్వాసంతో నిలబడి ఎన్నో సామాజికహితమైనటువంటి షార్ట్ ఫిలిం లు తీస్తూ ఎంతోమంది చిన్నారులను అద్భుతమైన డాన్సర్లుగా తీర్చిదిద్దుతున్న కళ్యాణ్ మరియు సుమిత్రలు గత ఏడు సంవత్సరాల నుండి తమకు అండగా నిలిచి ఆదరిస్తూ ఆర్థికమైన చేయూతనందిస్తూ ప్రోత్సహిస్తున్న మనసున్న మంచి మనిషి.ఆచార్య డాక్టర్ మద్దెల శివ కుమార్ ను దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా స్థానిక బస్టాండ్ సెంటర్ వద్ద గల చిల్డ్రన్ పార్క్ లో పూలమాలలు శాలువాతో ఘనంగా సత్కరించి అభినందించి ప్రత్యేకమైన మెమొంటోను బహుకరించారు.
ఈ సందర్భంగా ఆచార్య డాక్టర్ మద్దెల శివకుమార్ మాట్లాడుతూ ప్రభుత్వాలు కూడా ముందుకు వచ్చి దివ్యాంగులను అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తూ ప్రోత్సహించడానికి కావలసిన రాయితీలను ప్రకటించాలని వారికి నెలనెలా జీవన భృతిని అదేవిధంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇళ్ల స్థలాలు ఇళ్లను కూడా కట్టించి ఇవ్వాలని విద్యార్థులకు ప్రత్యేక స్కాలర్షిప్లు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.దివ్యాంగుల దినోత్సవ సందర్భంగా ఈ సృష్టిలోని ప్రతి దివ్యాంగుడికి దివ్యాంగురాలికి ఆచార్య డాక్టర్ మద్దెల శివకుమార్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసినారు.ఈ కార్యక్రమంలో ఆచార్య డాక్టర్ మద్దెల శివకుమార్ తో పాటు కళ్యాణ్ సుమిత్ర ఎంటర్టైన్మెంట్ అధినేతలు కళ్యాణ్ మరియు సుమిత్రలు పాల్గొన్నారు.





