కోల్ ఇండియా సింగరేణి క్రీడా మహోత్సవాలు
కొత్తగూడెం : కొత్తగూడెంలోని ప్రకాశం స్టేడియంలో జరుగుతున్న కోల్ ఇండియా సింగరేణి క్రీడా మహోత్సవాలు ప్రారంభోత్సవ కార్యక్రమంలో తెరాస రాష్ట్ర నాయకులు ఖమ్మం మాజీ పార్లమెంట్ సభ్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు పాల్గొన్నారు, క్రీడాకారులను పరిచయం చేసుకొని పోటీలను ప్రారంభించారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభ కార్యక్రమంలో ప్రసంగించారు.పోటీలను నిర్వహిస్తున్న నిర్వాహక కమిటీ సభ్యులను అభినందనలు తెలిపారు.అనంతరం నిర్వాహకులు పొంగులేటిని ఘనంగా సత్కరించారు.అదేవిధంగా కొత్తగూడెంలోని పలు ప్రాంతాల్లో జరిగిన శుభ కార్యక్రమాల్లో పొంగులేటి పాల్గొన్నారు.ఈ పర్యటనలో పొంగులేటి వెంట కొత్తగూడెం జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ కంచర్ల చంద్రశేఖర రావు,తెరాస రాష్ట్ర నాయకులు ఊకంటి గోపాలరావు,ఆళ్ల మురళి,డిసిసిబి డైరెక్టర్ తుళ్లూరి బ్రహ్మయ్య,డాక్టర్ కోటా రాంబాబు, టీబీజీకే కార్పొరేటర్ సోమిరెడ్డి,చీకటి కార్తీక్,మైనార్టీ నాయకులు గౌస్ భాయ్,సత్యనారాయణ రెడ్డి,ఖమ్మం నగర కార్పొరేటర్ దొడ్డ నగేష్,వడ్డేం సతీష్,కల్లూరి సంపత్,రాము,జక్కుపల్లి ప్రసాద్,దేవరగట్ల ప్రసాద్,కలకోటి రాజు,సతీష్,పవన్,నవీన్,కుశాల్,బన్నీ,వికాస్,తదితరులు పాల్గొన్నారు.





