ప్రభుత్వ విద్యా సంస్థలలో మౌలిక వసతులు కల్పించాలి
- PDSU వికారాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి గారికి వినతి పత్రం
తాండూర్ : ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా స్థానిక ప్రభుత్వ విద్యాసంస్థల లో నెలకొని ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని పీడీఎస్యూ ఉమ్మడి రంగారెడ్డి జిల్లా కమిటీ ఆధ్వర్యంలోపీడీఎస్యూ ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షుడు దీపక్ రెడ్డి,ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది.ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా ప్రాథమిక పాఠశాలలో కనీస మౌలిక వసతులు లేకపోవడంతో పాటు శిథిల వ్యవస్థకు చేరిన భవనాలను ఏర్పాటు చేసేందుకు కృషి చేయాలని మధ్యాహ్న భోజనం కూడా సరైన విధంగా పెట్టకపోవడంతో విద్యార్థిని,విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నాట్లు తెలియజేయడం జరిగింది.
దానికి మాజీ మంత్రి వర్యులు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి సానుకూలంగా స్పందించరు.వాటిని తోడు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో మరియు కళాశాలలో సమస్యలతో విద్యార్థిని,విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.ఈ సమస్యలన్నిటిని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం అయ్యే విధంగా చూడాలని తెలియజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో మాజీ పట్టణ అధ్యక్షుడు అబ్దుల్ రావుఫ్,మాజీ కౌన్సిలర్ సయ్యద్ జుబైర్ లలా,బి.రఘు,పీడీఎస్యూ ఉమ్మడి రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్,ఉమ్మడి రంగారెడ్డి జిల్లా సభ్యులు నరేష్,ప్రకాష్,తదితరులు పాల్గొన్నారు.





