గ్రామాలు అభివృద్ధి చేసే వరకు నిద్రపోను
బషీరాబాద్ : పల్లెపల్లెకు పైలెట్ కార్యక్రమంలో భాగంగా ఇవాళ రెండో రోజు బషీరాబాద్, గంగ్వార్ గ్రామాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి గారు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ కృషితో మన తాండూరుకు భారీగా నిధులు సమకూర్చుకున్నాం.పల్లెపల్లెకి పైలెట్ రెండో దశ కార్యక్రమంలో భాగంగా ఇవాళ బషీరాబాద్ లో పర్యటించడం జరుగుతుంది.బషీరాబాద్ నా సొంత మండలం కావడం నా అదృష్టం.బషీరాబాద్ మండలానికి కనీవిని ఎరుగని రీతిలో రూ.100 కోట్ల నిధులు తీసుకురావడం జరిగింది.తాండూరు రూపురేఖలు మారబోతున్నాయి. బషీరాబాద్ జూనియర్ కాలేజీ కోరక నెరవెరబోతుంది.త్వరలోనే ఆ జీవో విడుదల అవుతుంది.హెడ్ క్వార్టర్ రూపు రేఖలు మారుస్తా.ఈ క్రమంలోనే నేను మాటిస్తున్నా రూ.3 కోట్లతో బషీరాబాద్ హెడ్ క్వాటర్ కు ఇవాళ నిధులను మంజూరు చేస్తున్నా.తాండూను అభివృద్ధికై కంకణం కట్టుకున్నా.2018 నుంచి ఇప్పటివరకు బషీరాబాద్ కి సంక్షేమ పథకాలు,అభివద్ధి కార్యక్రమాలు కలిపి రూ.కోటి 50 లక్షలు ఖర్చు చేసుకున్నాం.2 స్కూల్స్ మరమత్తులు,రోడ్లు,ట్రాక్టర్,కాంపౌండ్ షెడ్డు,గొర్రెలె,బర్రెల షెడ్లు,హరితహారం,పల్లె ప్రకృతి,రైతుబంధు,రైతుబీమా,కల్యాణ లక్ష్మీ,షాదీముబారక్ ,స్థ్రీనిధి లోన్స్,ఆసరా పించన్లు,రేషన్ బియ్యం,మిషన్ భగీరథ లాంటి ఎన్నో అభివృద్ధి,సంక్షేమ కార్యక్రమాలు చేసుకున్నాం.ఇంకా మిగిలిన పనులన్నీ అతి త్వరలోనే పూర్తి చేయాలని కాంట్రాక్టర్లను ఆదేశించడం జరిగింది.
డబులతో స్వాగతం పలుకుతున్న గ్రామస్థులు
ప్రజలకు ఎలాంటి సమస్యలున్నా నా దృష్టికి తీసుకురావాలి.వచ్చే ఆరు నెలల్లో మిగతా సమస్యలన్నీ తీరుతాయి.ఇంకా ఎన్నో పనులను తీర్చుకుంటున్నాం.మా స్థాఫ్ ప్రజాబంధు టీమ్ ఎల్లప్పుడూ అందబాటులోనే ఉంటారు.స్లైడ్ డ్రైన్లు,సీసీ రోడ్లు,అంగన్ వాడీ కేంద్రాలకు కూడా పరికరాలు ఇవ్వడం జరిగింది.స్మశాన వాటిక నిర్మాణ దశలో ఉంది.అది త్వరలోనే పూర్తి చేస్తా.ఇంకా బస్టాండ్లు, మోడల్ స్కూల్స్,రైలు విషయానికొస్తే కేంద్రం మనమీద కక్ష్య సాధింపుతో నిర్లక్ష్యం వహిస్తున్నారు.అభివృద్ధికి అడ్డంగా బీజేపీ ఉంది. తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చిన సీఎం ముఖ్యమంత్రి దేశంలోనే ఆదరర్శంగా నిలిచారు.వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరెంటు,రైతు బంధు లాంటి పథకాలతో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచింది.మహిళలకు ప్రధాన ప్రాధాన్యం ఇచ్చే ముఖ్యమంత్రి గారు కేసీఆర్ కిట్,ఒంటరి మహిళా పించన్,కళ్యాణ లక్ష్మీ,షాదీ ముబారక్ పథకాలతో ఆడపడుచులకు అండగా నిలుస్తున్నారు.తాండూరు ప్రత్యేక నిధులు తీసుకొచ్చాం.తాండూరు అభివృద్ధి టీఆర్ఎస్ పార్టీతోనే సాధ్యం.కొత్త నిధులతో ప్రతి గ్రామం, తాండాల రూపు రేఖలు మారబోతున్నాయి.పర్యటనలో బషీరాబాద్ వాసులు నాకు ఘన స్వాగతం పలికారు.ఈ కార్యక్రమాలలో సీనియర్ నాయకులు రాజు పటేల్,మండల అధ్యక్షులు రాము నాయక్,తాహెర్ బాండ్,మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తన్వీర్ సింగ్,జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజు గౌడ్,ఎంపిడిఓ రమేష్,ఇతర అధికారులు తదితరులు పాల్కొన్నారు.






