ఏక్మాయి గ్రామంలో అంబేద్కర్ 66 వర్దంతి
- డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కు జోహార్లు
- ఏక్మాయి గ్రామ అంబేద్కర్ యువజన సంఘం
బషీరాబాద్ : బషీరాబాద్ మండలం ఏక్మాయి గ్రామంలో అంబేద్కర్ 66 వర్దంతి సంధర్బంగా కొవ్వొత్తిలు వెలిగించి మౌన ధ్యానం పాటించారు.యువకులు మాట్లాడుతూ అందరికి బతుకు నిచ్చేది అందరిని బతకనిచ్చేది అంబేద్కరిజం.18 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు పాలిపించిది మన అంబేద్కర్. విశ్వశాంతి నందించే బుద్దుని శాంతియుత పద్దతుల్లో సాధించే సామ్యవాదం సమతా వాదం.సామ్యవాదంతో కూడిన ప్రజాస్వామ్యం బహుళ పార్టీ ప్రజాస్వామ్యం.సామాజిక వర్గాల ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం.
కొవ్వొత్తులతో అంబేద్కర్ యువజన యువకులు
ప్రజలు చురుకుగా పాల్గొనే ప్రజాస్వామ్యం సామాజిక న్యాయం ద్వారా సామాజిక మార్పు, సామాజిక సామానత సాధించడం అంబేద్కరిజం గమ్యం.సామాజిక సమానతతో కూడిన స్వేచ్చ సమానత్వం సౌభ్రాతృత్వం అందరికి సమాన అవకాశాలు.అవి అందుకోలేని వారికి ప్రత్సేక ప్రాతినిధ్యం,రక్షణలు సామ్యవాద ప్రజాస్వామ్య మానవీయ సంస్కృతి.అందరికి భద్రత నిచ్చేది అంబేద్కర్ ఇచ్చిన స్వేచ్ఛ హక్కు ఉందని తెలిపారు.ఈ కార్యక్రమాలలో లక్మరి శమప్ప,జెల్ల కాశి,రోహితన్న యువసేన విజయ్ కుమార్,బింగి మొగులప్ప,కమల్ కుమార్ యువకులు తదితరులు పాల్కొన్నారు.






