తాండూర్ లో లంచం తీసుకున్నాడు జైల్ కి వెళ్లాడు
- లంచం తీసుకున్న సబ్ రిజిస్ట్రార్ జమీరుద్దీన్
- లంచం తీసుకుంటూ తాండూర్ సబ్ రిజిస్ట్రార్
- 50 వేల నగదును ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా
- తాండూరు సబ్ రిజిస్టర్ కార్యాలయం పై ఏసీబీ దాడులు
తాండూర్ : వికారాబాద్ జిల్లా తాండూరు సబ్ రిజిస్టర్ కార్యాలయం పై ఏసీబీ దాడులు.లంచం చట్టరీత్యా నేరం కానీ ఈ రోజులో లంచం అలవాటుగా మారింది.ఓ వ్యక్తి నుండి లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ పట్టుబడ్డ తాండూర్ సబ్ రిజిస్ట్రార్ జమీరుద్దీన్ ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.తాండూర్ పట్టణంలో భూమి విషయంలో ఇర్షాద్ అనే వ్యక్తి హీర్య నాయక్ కు 5 లక్షలు అప్పుగా ఇచ్చాడు.హీర్య నాయక్, ఇర్షాద్ పేరు పై కొంత భూమి రిజిస్ట్రారు చేశాడు.ఇర్షాద్ ఈ యొక్క రిజిస్ట్రేషన్ చేసిన భూమి కాన్సల్ చేయమని తాండూర్ సబ్ రిజిస్ట్రార్ ని కోరగా.తాండూర్ సబ్ రిజిస్ట్రార్ జమీరుద్దీన్ 1 లక్ష డిమాండ్ చేయడంతో బాధితుడు ఏసీబీ ఆశ్రయించారు.ఈరోజు తాండూర్ సబ్ రిజిస్ట్రార్ కార్యలయంలో సబ్ రిజిస్ట్రార్ జమీరుద్దీన్ లంచం తీసుకుంటూ ఉండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.అనంతరం ఏసీబీ డిఎస్పీ ఆధ్వర్యంలో దాడులు నిర్వహించి సోదాలు చేసి కేసు నమోదు చేసి జైలకి తరలించారు.





