గ్రామాల అభివృద్ధి...ఎమ్మెల్యే పైలెట్ తోనే సాధ్యం
- గ్రామంలో సమస్యలు తెలుసుకుంటున్న పైలెట్
- నీళ్ళపల్లి ఏకాంబరి రామలింగేశ్వరస్వామి ఆలయానికి రూ.1 కోటి మంజూరు
- కోటి రూపాయలతో ఆలయంలో మౌలిక సదుపాయాలు
- ఆలయాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి
- ఏక్మాయి గ్రామని పట్టించుకొని సర్పంచ్ అంటున్న గ్రామస్థులు
- మంతన్ గౌడ్ గ్రామంలో ఆత్మీయ సమ్మేళనం
- టపాకాయలతో స్వాగతం పలికిన గ్రామస్థులు
- ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి
బషీరాబాద్ : ఎమ్మెల్యే చేపట్టిన పల్లె పల్లెకు పైలెట్ కార్యక్రమం సోమవారం రోజు బషీరాబాద్ మండలంలో ఏకాంబరి రామలింగేశ్వరస్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. దేవస్థానాన్ని సందర్శించిన ఎమ్మెల్యే కమిటీ సభ్యులతో సమస్యలను అడిగి తెలుసుకున్నారు.ఆలయ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కోటి రూపాయలు మంజూరు చేసిందని ఆ నిధులతో ఆలయంలో మౌలిక సదుపాయాలు కల్పిస్తామని ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి గారు అన్నారు.ఆలయానికి కోటి రూపాయలు మంజూరు చేసినందుకు కమిటీ సభ్యులు,గ్రామస్థులు సంతోషం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలిపారు.మైల్వార్ తాండ,మైల్వార్,ఏక్మాయి,గ్రామంలో పర్యటించి సమస్యలు తెలుసుకున్న ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి.
గ్రామ సమస్యలను వివరిస్తున్న గ్రామస్థుడు పాండు
ఏక్మాయి గ్రామంలో గ్రామస్థులు పలు సమస్యలు ఎమ్మెల్యే గారికి అడుగగా మధికేంటి గ్రామకి బస్సు కావాలి అని అడుగా వెంబడే డిపో మేనేజర్ గారికి ఫోన్ చేసి సమస్యను పరిష్కారం చేయడం జరిగింది.నాయకులు మరియు యువకులు విజయ్ కుమార్ ఎమ్మెల్యే గారికి శాల్వ పూవ్వులమాలతో సన్మానించారు.సర్పంచ్ ఏక్మాయి గ్రామంలో గ్రామ సమస్యలను పట్టించుకోవడం లేదు అని గ్రామస్థులు తెలిపారు.ఎమ్మెల్యే ఏక్మాయి గ్రామానికి 50 లక్షలు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు మరియు రోడ్లు,మరుగు దొడ్లు పలు గ్రామ సమస్యలను పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారు.
సన్మానం చేసిన యువకులు విజయ్ కుమార్,కశప్ప
పలు శాఖల అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొనగా అనంతరం గ్రామస్తులను ఉద్దేశించి మాట్లాడారు. తన సొంత మండలమైన బషీరాబాద్ మండలం అభివృద్ధికి అధిక ప్రాధాన్యం ఇస్తామని ఈ సందర్భంగా ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యమిస్తూ సైడ్ డ్రెయిన్లు, సిసి రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తుందని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్,మంత్రులు కేటీఆర్,సబితా ఇంద్రారెడ్డి,ఎంపీ రంజిత్ రెడ్డి సహకారంతో తాండూరుకు అధిక నిధులు మంజూరు అయాయిని తెలిపారు.తెలంగాణ రాష్ట్రం సాధించాకా ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అన్ని వర్గాల ప్రజలకు ఫలాలు అందుతున్నాయని తెలిపారు.వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరెంటు,రైతు బంధు లాంటి పథకాలతో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు.
మహిళలకు ప్రధాన ప్రాధాన్యం ఇచ్చే ముఖ్యమంత్రి కేసీఆర్ కిట్,ఒంటరి మహిళా పించన్,కళ్యాణ లక్ష్మీ,షాదీ ముబారక్ పథకాలతో ఆడపడుచులకు అండగా నిలుస్తున్నారని చెప్పారు.తాండూరు ప్రత్యేక నిధులు తాండూరు అభివృద్ధి టీఆర్ఎస్ పార్టీతోనే సాధ్యం అన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజు గౌడ్,మండల పార్టీ అధ్యక్షుడు రాము నాయక్,పిఎసిఎస్ చైర్మన్ వెంకట్ రామ్ రెడ్డి,నాయకులు నర్సిరెడ్డి,గోపాల్ రెడ్డి,సికిందర్ ఖాన్,శివరాం నాయక్,పాండురంగ రెడ్డి,రుక్మా రెడ్డి,వెంకటయ్య, ముకుంద్,నరేష్ చవాన్,హన్మంత్ రెడ్డి,సర్పంచులు లాలూ,సూర్య నాయక్,దేవ్ సింగ్,నర్శి రెడ్డి,ఎంపిటిసిలు లక్ష్మి బాయి,రాజు,ఏకమై తెరాస యూత్ అధ్యక్షుడు విజయ్ కుమార్,ఎంపిటిసి రాజు పలు గ్రామాల నాయకులు తదితరులు పాల్కొన్నారు.







