తెలుగు ప్రజల ఆణిముత్యం,తెలుగువారికి వరం..ఘంటసాల అమృతగానం
- ఘంటసాల శతజయంతి ఉత్సవాలలో పాల్గొన్న శ్రీ వనమా రాఘవేంద్రరావు
భద్రాద్రి కొత్తగూడెం : ఘనంగా జరుపుకున్నా ఘంటసాల శతజయంతి ఉత్సవాలు. ఖాసీం మెగా అసోసియేషన్, శ్రీ వెంకటేశ్వర కళా నాట్య మండలి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు శత జయంతి ఉత్సావాలలో ముఖ్య అతిధిగా వనమా రాఘవ పాల్కొన్నారు.ఈ సందర్బంగా వనమా రాఘవ మాట్లాడుతూ ముప్పై ఏళ్ల కెరియర్‌లో ఇంచుమించు ప్రతి ఏడూ ఉత్తమ గాయకుడు ఘంటసాలే అనీ,తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్థాన విద్వాంసుడిగా మూలవిరాట్టు వేంకటేశ్వరస్వామి ఎదురుగా భక్తి గీతాలు ఆలపించిన ధన్యజీవి పద్మశ్రీ ఘంటసాల శత జయంతి ఉత్సవాలలో పాల్గొనటం అదృష్టంగా బావిస్తునన్నారు.ఈ కార్యక్రమాలలో పాల్వంచ పట్టణ తెరాస అధ్యక్షులు మంతపురి రాజుగౌడ్,చావా శ్రీను,పాల్వంచ సొసైటీ వైస్ చైర్మన్ కాంపెల్లి కనకేష్,SVRK ఆచార్యులు,TRSV అధ్యక్షులు బత్తులమధుచంద్,టిఆర్ఎస్ నాయకులు కాల్వ ప్రకాష్, వీర స్వామి, మెగాఖాసీం,కొండలరావు,సైదులు, రోశయ్య,మౌలా, రసూల్, సిద్దు,భాషా,జ్యోతి,మీరాభి, సైదాభి,పలువురు గాయకులు, కళాకారులు పాల్గొన్నారు.





