పాఠం చెప్తూ...గుండె ఆగింది...టీచర్ మృతి While reading the lesson Teacher heart stopped
బాపట్ల Bapatla : యథావిధిగా పాఠశాలకు వచ్చిన వీరబాబు విద్యార్థులకు పాఠాలు చెబుతూ ఒక్కసారిగా గుండెపోటుకు గురై కుర్చీలోనే మృతి చెందాడు.ఈ ప్రాంతంలో సడన్ షాక్,రోజు మాదిరిగానే ఉదయం పాఠశాల ప్రారంభమైంది.ప్రార్థనా గీతం అనంతరం తరగతి గదిలో ఉపాధ్యాయుడు పాఠం మొదలు పెట్టాడు.ఇంతలోనే తరగతి గది నుంచి ఒక్కసారిగా విద్యార్థులు కేకలు వినబడ్డాయి.సహ ఉపాధ్యాయులు ఏం జరిగిందోనని ఆందోళనతో ఆ తరగతి గదిలోకి వెళ్లగా కుర్చీలో ఉపాధ్యాయుడు కుప్ప కూలిపోయాడు.ఆందోళనతో 108కు సమాచారం అందించగా వారు పరీక్షించి ఉపాధ్యాయుడు మృతి చెందినట్లు చెప్పారు.ఈ విషాద ఘటన బాపట్ల జిల్లా వేటపాలెం మండలం వాకావారిపాలెం ప్రాథమిక పాఠశాలలో శనివారం జరిగింది.వాకావారిపాలెంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో జె.పంగులూరుకు చెందిన పాల వీరబాబు (45) ఉపాధ్యాయుడు అతడి భార్య కూడా ఇదే మండలంలోని కొండమూరులో ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయురాలుగా ఉంది.
![]() |