CPI ML న్యూడెమోక్రసీ సమావేశం
పరిగి Parigi : వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గంలో సిపిఐ పార్టీ నుండి సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ సమావేశంలో చేరికలు నిర్వహించారు.CPI ML న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో ఆదివారం రోజున పరిగి పట్టణంలో CPI ML న్యూడెమోక్రసీ సమావేశాన్ని నిర్వహించారు.ఈ సమావేశంలో IFTU జాతీయ ప్రధాన కార్యదర్శి బి.ప్రదీప్,CPI ML న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఝాన్సీ,PDSU రాష్ట్ర అధ్యక్షులు మహేష్ ,CPI ML న్యూడెమోక్రసీ వికారాబాద్ సెక్రెటరీ వై మహేందర్ IFTU జిల్లా కన్వీనర్ వై గీత పాల్గొన్నారు.ఈ సందర్భంగా సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ వికారాబాద్ సెక్రెటరీ వై మహేందర్ మాట్లాడుతూ గతంలో పరిగి సీపీఐ పార్టీలో పని చేసిన నాయకులూ B .మల్లేష్ , J .శివ కుమార్,M .బాబయ్య,B .యాదయ్య, R .శ్రీనివాస్,M .వెంకటయ్య ,CH.లక్ష్మణ్,రాములు,దశరథ,శ్రీనివాస్,నరేష్,కిరణ్,వెంకటేష్ మరియు విద్యార్ధి విభాగం నుంచి M.శ్రీశైలం మరియు తదితరులు సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఝాన్సీ గారి అద్వర్యంలో CPI ML న్యూడెమోక్రసీ పార్టీలో చేరడం జరిగింది అని తెలియజేసారు.ఈ సందర్భంగా CPI ML న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఝాన్సీ గారు B .మల్లేష్ ను సీపీఐ ఎంఎల్ పార్టీకి పరిగి డివిజన్ కార్యదర్శిగా నియమించడం జరిగింది . ఈ సందర్భంగా B .మల్లేష్ మాట్లాడుతూ సీపీఐ ఎం ఎల్ పార్టీ తరపున ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేస్టానని తెలిపారు.ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.