Type Here to Get Search Results !

Sports Ad

భార్యాభర్తలు అంగీకరిస్తే వెంటనే విడాకులు ఇవ్వొచ్చు If the husband and wife agree, they can divorce immediately

 

భార్యాభర్తలు అంగీకరిస్తే వెంటనే విడాకులు ఇవ్వొచ్చు 

* విడాకుల అంశంలో సుప్రీం కోర్టు కీలక తీర్పు.
* భార్యాభర్తలు విడాకుల కోసం పరస్పర అంగీకారం 
* 6 నెలలు అగాల్సిన అవసరం లేదు 

దిల్లీ Delhi : విడాకుల (Divorce) మంజూరు అంశంపై సుప్రీంకోర్టు ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం సోమవారం సంచలన తీర్పు వెలువరించింది. భార్యాభర్తలు కలిసి జీవించలేని పరిస్థితుల్లో వారికి వెంటనే విడాకులు ఇవ్వొచ్చని సుప్రీంకోర్టు తెలిపింది. పరస్పర అంగీకారంతో దంపతులు విడిపోవాలనుకుంటే.. అందుకు 6 నెలలు ఆగాల్సిన అవసరం లేదని పేర్కొంది. కొన్ని షరతులతో ఈ ఆరు నెలల నిరీక్షణ నిబంధనను సర్వోన్నత న్యాయస్థానం సడలించింది.

‘‘దంపతుల మధ్య వివాహ బంధం (Marriage) కోలుకోలేని విధంగా విచ్ఛినమైతే ఆ కారణం కింద వారి పెళ్లి రద్దు చేసి విడాకులు మంజూరు చేయడం ఈ కోర్టుకు సాధ్యమే. ఆర్టికల్‌ 142 కింద విస్తృత అధికారాలను ఉపయోగించుకుని సుప్రీంకోర్టు వారికి విడాకులు మంజూరు చేయొచ్చు. భార్యాభర్తలు పరస్పర అంగీకారంతో విడిపోవాలనుకుంటే అందు కోసం ఆరు నెలలు ఆగాల్సిన అవసరం లేదు. కొన్ని షరతులతో ఈ తప్పనిసరి నిరీక్షణ గడువును ఎత్తివేయొచ్చు’’ అని జస్టిస్‌ ఎస్‌.కే. కౌల్‌ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం తీర్పు వెలువరించింది.కుటుంబ న్యాయస్థానాలకు (Family Court) రిఫర్‌ చేయకుండానే సుప్రీంకోర్టు నేరుగా విడాకులు మంజూరు చేసే అంశంపై పలు పిటిషన్లు దాఖలయ్యాయి.

మరిన్ని వార్తల కోసం... 

* మగవారు తప్పక చదవండి... మగవారిలో టెస్టోస్టిరాన్ తగినంత స్థాయిలో ఉండాలా ? ఇక్కడ క్లిక్ చేయండి 

* కాలేయం దెబ్బతినడానికి కొన్ని కారణాలు ఇక్కడ క్లిక్ చేయండి


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies