ముస్లిం మైనారిటీ సంక్షేమానికి ప్రభుత్వం కృషి
* ముస్లిం సోదర మరిdయు సోదరిమణులకు శుభాకాంక్షలు
* పాల్కొన్న ఎమ్మెల్యే,ఎమ్యెల్సీ
* బక్రీద్ పర్వదినాన్నిలో ప్రత్యేక ప్రార్థనలు
తాండూర్ Tandur News భారత్ ప్రతినిధి : తాండూర్ పట్టణంలోని హైదరాబాద్ రోడ్ లో గల ఐలే హదీస్ ఈద్గాలో,చేన్ గెస్ పూర్ రోడ్ లో గల ఈద్గాలో బక్రీద్ పర్వదినాన్ని నిర్వహించారు.ఈ సంధర్బంగా ఎమ్యెల్యే పైలట్ రోహిత్ రెడ్డి,ఎమ్యెల్సీ మహేందర్ రెడ్డి ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిధిగా పాల్కొన్నారు.ఈ యొక్క కార్యక్రమాన్ని పురస్కరించుకొని ప్రత్యేక ప్రార్థనలు చేసి ముస్లిం సోదర మరియు సోదరిమణులకు శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్బంగా మాట్లాడుతూ త్యాగానికి ప్రతికైన బక్రీద్ పర్వదినాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో సంతోషంగా జరుపుకోవాలని, మరియు ఆ అల్లాహ్ యొక్క దీవెనలు మనందరిపైన ఉండాలని, అలాగే ముస్లిం సమాజానికి అన్ని వేళలా అండగా ఉంటానని, ప్రతి విషయంలో తోడుగా ఉంటానని తెలిపారు.
దేశంలో ఎక్కడ లేని విధంగా ముస్లిం మైనారిటీ వర్గాల అభివృద్ధికి కృషి చేస్తున్నది కేవలం తెలంగాణ ప్రభుత్వం మాత్రమే అని తెలియజేశారు. అదే విధంగా తాండూర్ లో ఎన్నడూ లేని విధంగా ఈద్గాల కోసం మరియు కబరిస్తాన్ల కోసం స్థలం కేటాయించి వాటికి అభివృద్ధి చేస్తున్నది తెలంగాణ ప్రభుత్వం మాత్రమే అని రానున్న రోజుల్లో కూడా ముస్లిం మైనారిటీల సంక్షేమం మరియు అభివృద్ధి కోసం అన్నివేళలా మీ రోహిత్ రెడ్డి ఎప్పుడు అండగా ఉంటానని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ రాజు గౌడ్, బిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు నయీమ్ అప్పు,సీనియర్ నాయకులు పట్లోళ్ల నర్సింలు, శ్రీనివాస్ చారి,విట్టల్ నాయక్,అధికార ప్రతినిధి వెంకట్ రెడ్డి,ముస్లిం పెద్దలు, తదితరులు పాల్గొన్నారు.