ఈటలకు సెక్యూరిటీ డీజీపీకి కేటీఆర్ కీలక ఆదేశాలు
హైదరాబాద్ Hyderabad News : జూన్ 28 బుధవారం హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ భద్రతపై మంత్రి కేటీఆర్ ఆరా తీశారు. ఇదే అంశమై డీజీపీ అంజనీకుమార్ తో ఫోన్ లో కేటీఆర్ మాట్లాడారు. ఈటల భద్రతపై సీనియర్ ఐపీఎస్ అధికారితో వెరిఫై చేయించాలని డీజీపీకి కేటీఆర్ సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం తరపునే ఈటలకు సెక్యూరిటీ ఇవ్వాలని సూచించారు. ఈటలకు భద్రత పెంపుపై డీజీపీ సమీక్ష చేయనున్నారు.కాసేపట్లో ఈటల ఇంటికి సీనియర్ ఐపీఎస్ అధికారి వెళ్లనున్నారు. అయితే నిన్న ప్రెస్ మీట్ లో ఈటల భార్య జమున ఈటలకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డితో ప్రాణ హాని ఉందని సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. దీంతో గంటల వ్యవధిలోనే ఈటలకు ‘‘వై కేటగిరి’’ భద్రత కల్పిస్తున్నట్లు కేంద్ర హోంశాఖ వెల్లడించిన విషయం తెలిసిందే. తాజాగా రాష్ట్ర ప్రభుత్వమే ఈటలకు సెక్యూరిటీ ఇవ్వాలని మంత్రి కేటీఆర్ డీజీపీని ఆదేశించడంతో హుజురాబాద్ ఎమ్మెల్యే భద్రతపై ఉత్కంఠ నెలకొంది.