మార్చి 1న మాదిగ అమారవీరులను స్మరిస్తూ పెద్దఎత్తున సంస్మరణ కార్యక్రమం
వికారాబాద్ Vikarabad News భారత్ ప్రతినిధి : ఎస్సీ రిజర్వేషన్లు వర్గీకరణ చట్టబద్ధ సాధన కోసం జరిగిన పోరాటంలో అసువులు బాసిన వీరులను స్మరించుకోవడం మన బాధ్యత అందుకోసం ప్రతి సంవత్సరం మార్చి 1న అమరవీరుల సంస్కరణ రోజుగా పాటిస్తూ సంస్కరణ సభలు నిర్వహిస్తూ వారికి నివాళులు అర్పిస్తున్నాం అదే విధంగా ఈ మార్చ్1 తేదీన కూడా మనం మన పోరాటంలో నేల కొరిగిన వీరులను తలచుకుంటూ వారి త్యాగాలను ఎత్తిపడుతూ మాదిగ అమరవీరుల సంస్కరణ సభలను అన్ని జిల్లా మండల కేంద్రాల్లో మరియు అన్ని గ్రామాల్లో అలాగే ప్రతి విద్య సంస్థలో పెద్ద ఎత్తున నిర్వహించాలి.
మాదిగ మరియు చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించాలి వారి త్యాగాలను గుర్తు చేసుకొని వారి ఉద్యమ స్ఫూర్తిని మది నిండా తలుచుకొని ఎస్సీ వర్గీకరణ సాధించే వరకుపోరాడుతామని జాతి యావత్తు ప్రతిజ్ఞ చేయాలి అందుకోసం ఇప్పటినుండి సిద్ధపడాలని ఎమ్మార్పీఎస్ మరియు అన్ని అనుబంధ సంఘాల బాధితులకు గుర్తు చేస్తున్నాము అని అన్నారు.