ఎస్సీ వర్గీకరణ ద్వారానే అన్ని రంగాల్లో సమన్యాయం జరుగుతుంది
తెలంగాణ Telangana News భారత్ ప్రతినిధి: కొడంగల్ మండల కేంద్రంలో ఎమ్మార్పీఎస్ మండల కమిటీ ఎన్నిక సమావేశాన్ని మండల ఇంఛార్జి అర్.అంజి మాదిగ అధ్వర్యంలో ఏర్పాటు చేశారు ఈ సమావేశనికి ఎమ్మార్పీఎస్ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు కోడిగంటి మల్లికార్జున్ మాదిగ అజరయ్యారు ఆయన ఆధ్వర్యంలో మండల కమిటీ ఎన్నిక చేశారు అధ్యక్షుడుగా దోమ అశోక్ మాదిగ. ఉప అధ్యక్షుడిగా టి.సిద్దు మాదిగ. అధికార ప్రతినిధిగా కే.నగప్ప మాదిగ ప్రధాన కార్యదర్శిగా కె.మధు మాదిగ కార్యదర్శిగా టి.నరహరి మాదిగ.
ప్రచార కార్యదర్షిగా శివకుమార్ మాదిగ. కోశాధికారిగా ఎం.చెందు మాదిగ గౌరవ సలహాదారులుగా భిమాప్ప మాదిగ కార్యవర్గం సభ్యులుగా మహేష్ మాదిగ. అశోక్ మాదిగ. నవీన్ మాదిగ. రాములు. తదితరులను ఎన్నికయ్యారు.నూతన కార్యవర్గానికి మల్లికార్జున్ మాదిగ శుభాకాంక్షలు తెలుపుతూ అట్లాగే వారికి మాదిగ మరియు ఉప కులాల అభ్యున్నతి కోసం ముందుకు సాగాలని కోరారు. అనంతరం మల్లికార్జున్ మాదిగ మాట్లాడుతూ వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా ఎమ్మార్పీఎస్ ఉద్యమాన్ని సంస్థాగతంగా బలంగా చేయడానికే కమిటీలు నిర్మాణం చేస్తున్నామని తెలిపారు.
అట్లాగే ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ సాధిస్తేనే మాదిగ మరియు ఉప కులాలకు విద్య ఉద్యోగ రాజకీయ సంక్షేమ రంగాల్లో సామన అవకాశాలు వేస్తేనే అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ నాయకత్వంలో మాదిగలు మరియు ఉప కులాల ప్రజలు ముందుకు సాగాలని కోరారు మాదిగలతో పాటు సబ్బండ వర్ణాల ప్రజల సమస్యల కోసం ముందుండి పోరాడే సంఘం ఎమ్మార్పీఎస్ అని అన్నారు.
దండోరా ఉద్యమం 2004లో గుండె జబ్బులతో బాధపడుతున్న చిన్నారుల కోసం కోసం ఎమ్మార్పీఎస్ పోరాటం చేస్తే దాని ద్వారానే వైఎస్సార్ ప్రభుత్వంలో ఆరోగ్య శ్రీ పథకం రావడానికి కారణం అయ్యామని గుర్తుచేశారు ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ జిల్లా ఉప అధ్యక్షుడు మల్కప్పా మాదిగ అధికార ప్రతినిధి ప్రకాష్ మాదిగ శివాజీ మాదిగ తదితరులు పాల్గొన్నారు.





