Type Here to Get Search Results !

Sports Ad

భారత్‌ మయన్మార్‌ల సరిహద్దు లో మొత్తం 1,643 కిలోమీటర్ల మేర కంచె నిర్మాణం A total of 1,643 kilometers of fencing is being constructed on the India-Myanmar border


 భారత్‌ మయన్మార్‌ల సరిహద్దు లో మొత్తం 1,643 కిలోమీటర్ల మేర కంచె  నిర్మాణం

ఢిల్లీ Delhi News భారత్ ప్రతినిధి: భారత్‌ మయన్మార్‌ల సరిహద్దు లో మొత్తం 1,643 కిలోమీటర్ల మేర కంచెను నిర్మించాలని నిర్ణయించినట్లు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా వెల్లడించారు. పటిష్ఠమైన నిఘాను మరింత సులభతరం చేసేందుకుగానూ సరిహద్దు వెంబడి గస్తీమార్గాన్ని కూడా ఏర్పాటుచేస్తామని ప్రకటించారు. అభేద్యమైన సరిహద్దుల నిర్మాణానికి ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. ఇరు దేశాల మధ్య సరిహద్దును పూర్తిగా కవర్‌చేస్తూ 1,643 కిమీ పొడవునా కంచెను నిర్మిస్తాం. 

మణిపుర్‌లోని మోరేలో ఇప్పటికే 10 కిలోమీటర్ల మేర కంచెవేశాం. హైబ్రిడ్ నిఘా వ్యవస్థ (HSS) ద్వారా మణిపుర్‌, అరుణాచల్‌ ప్రదేశ్‌లలో కిలోమీటరు చొప్పున ఫెన్సింగ్‌ ఏర్పాటుకు పైలట్‌ప్రాజెక్టులు కొనసాగుతున్నాయి. మణిపుర్‌లో సుమారు 20 కి.మీ. మేర పనులకు కూడా ఆమోదం లభించింది. త్వరలోనే అవి ప్రారంభమవుతాయి అని అమిత్‌షా ట్వీట్‌చేశారు. ఈశాన్య రాష్ట్రాలైన మిజోరం, మణిపుర్‌, నాగాలాండ్‌, అరుణాచల్‌ ప్రదేశ్‌లు మయన్మార్‌తో సరిహద్దును పంచుకుంటున్నాయి.

 ఇప్పటివరకు సరిహద్దు నుంచి ఇరువైపులా 16 కిలోమీటర్ల వరకు ఎలాంటి వీసా లేకుండా ప్రజలు స్వేచ్ఛగా తిరిగే వెసులుబాటు ఉంది. అయితే ఆదేశం నుంచి భారత్‌లోకి అక్రమ చొరబాట్లు జరుగుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. మణిపుర్‌ సంక్షోభం మయన్మార్‌లో అంతర్యుద్ధంతో పరిస్థితులు ప్రభావితమయ్యాయి. ఇలాంటివి అరికట్టేందుకు ఆ దేశ సరిహద్దు వెంబడి కంచె వేస్తామని అమిత్‌ షా గత నెలలోనే ప్రకటించారు.


Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies