రైతులకు తీపీ వార్త.. మహిళలకు శుభవార్త..!
* రుణమాఫీ, గ్యాస్ సిలిండర్‌పై సర్కారు నిర్ణయం
* తెలంగాణ పద్దులో ఆరు గ్యారెంటీలకు పెద్దపీట
హైదరాబాద్, భారత్ ప్రతినిధి : తెలంగాణ రాష్ట్రంలోని రైతులకు, మహిళలకు రేవంత్ సర్కారు తీపి కబురును అందించింది. రైతులకు రూ. 2లక్షల రుణమాఫీ, మహిళలకు రూ. 500లకే గ్యాస్ సిలిండర్ పంపిణీకి నిర్ణయం తీసుకుంది. త్వరలోనే ఈ రెండు పథకాలను అమలు చేయాలని నిర్ణయించినట్లు ప్రకటించింది. శనివారం తెలంగాణ అసెంబ్లీలో ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క ఓట్ ఆన్ ఆకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. 2024-25 సంవత్సరానికి గాను బడ్జెట్ రూ.2,75,891కోట్లు ఉన్నట్లు తెలిపారు. ముఖ్యంగా రుణమాఫీపై ప్రత్యేక దృష్టి పెట్టారు.
ప్రతి రైతుకు రూ. 2లక్షల రుణమాఫీ చేస్తామని త్వరలోనే కార్యాచరణ అమలు అవుతుందన్నారు.అలాగే కౌలు రైతులకు ఉచిత భీమా వర్తింపజేస్తామన్నారు. అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి రూ. 500కే వంట గ్యాస్ అందజేస్తామని మరోసారి తెలిపారు. త్వరలోనే ఈ హామీకి సంబంధించి ప్రణాళికలు రూపొందిస్తామని తెలిపారు. మరోవైపు తెలంగాణ బడ్జెట్‌లో ప్రభుత్వం ఆరు గ్యారెంటీలకు పెద్దపీట వేసింది. ఇందుకు సంబంధించి రూ. 53,196 కోట్లు అంచనా వేసినట్లు పేర్కొన్నారు. అలాగే పరిశ్రమలకు రూ.2543 కోట్లు కేటాయిస్తున్నట్లు తెలిపారు. హైదరాబాద్ తో అనుసంధానమైన ఐటీ శాఖకు రూ. 774కోట్లు కేటాయించినట్లు పేర్కొన్నారు. అలాగే పంచాయతీ రాజ్ శాఖకు సంబంధించి రూ. 40,080 కోట్లు, పురపాలక శాఖకు రూ. 11,692 కోట్లు కేటాయింపులు చేశారు. మూసీ రివర్ ఫ్రాంట్ కు వెయ్యి కోట్లు కేటాయించగా.. వ్యవసాయ శాఖకు రూ. 19,746 కోట్లు నిధులు సమకూర్చినట్లు తెలిపారు.అలాగే ఎస్సి, ఎస్టీ గురుకుల భవన నిర్మాణాల కోసం రూ.1,250కోట్లు ఖర్చు చేయనున్నట్లు ప్రకటించారు. వీటితో పాటు ఇందిరమ్మ ఇళ్లపై కూడా ప్రత్యేక చొరవ చూపించారు. ఇళ్లు లేని ప్రతి పేదవాడికి ఇళ్లు కట్టించి ఇచ్చే బాధ్యత తమ ప్రభుత్వానిదే అని చెప్పారు. ధరణి రైతులపాలిట శాపంగా మారిందని వాటి సమస్యలను త్వరలోనే తొలగిస్తామన్నారు. అలాగే చేనేత కార్మికులను కూడా ఆదుకుంటామన్నారు.
బడ్జెట్‌లో శాఖలకు కేటాయింపులు ఇలా…
2024-25 ఓటాన్ అకౌంట్ బడ్జెట్ రూ. 2,75,891కోట్లు
ఆరు గ్యారెంటీల కోసం రూ. 53,196 కోట్లు అంచనా
పరిశ్రమల శాఖ రూ. 2,543 కోట్లు
ఐటి శాఖకు రూ. 7,74కోట్లు.
పంచాయతీ రాజ్ రూ. 40,080 కోట్లు
పురపాలక శాఖకు రూ. 11,692 కోట్లు
మూసీ రివర్ ఫ్రాంట్ కు వెయ్యి కోట్లు
వ్యవసాయ శాఖ రూ. 19,746 కోట్లు
ఎస్సి, ఎస్టీ గురుకుల భవన నిర్మాణాల కోసం రూ. 1,250కోట్లు
ఎస్సి సంక్షేమం రూ. 21, 874 కోట్లు
ఎస్టీ సంక్షేమం రూ. 13,013 కోట్లు
మైనార్టీ సంక్షేమం రూ. 2,262 కోట్లు
బీసీ సంక్షేమం, బీసీ గురుకుల భవనాల నిర్మాణం కోసం రూ. 1,546 కోట్లు.
బీసీ సంక్షేమం రూ. 8 వేల కోట్లు
విద్యా రంగానికి రూ. 21,389కోట్లు.
తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటుకు రూ. 5,00 కోట్లు.
యూనివర్సిటీల్లో సదుపాయాలకు రూ. 5,00 కోట్లు
వైద్య రంగానికి రూ. 11,500 కోట్లు
విద్యుత్ – గృహ జ్యోతికి రూ. 2,418కోట్లు.
విద్యుత్ సంస్థలకు రూ. 1,6825 కోట్లు.
గృహ నిర్మాణానికి రూ. 7,740 కోట్లు.
నీటి పారుదల శాఖకు రూ. 28,024 కోట్లు



.webp)

