Type Here to Get Search Results !

Sports Ad

బస్సులు టైం కు నడిచేల చర్యలు తీసుకోవాలని. వై గీత ఆర్టీసీ అధికారికి వినతిపత్రం Steps should be taken to run buses on time. Y Gita Petition to RTC Officer


 బస్సులు టైం కు నడిచేల చర్యలు తీసుకోవాలని. వై గీత ఆర్టీసీ అధికారికి వినతిపత్రం

వికారాబాద్ Vikarabad News భారత్ ప్రతినిధి : ఎంజీబీఎస్ నుండి వికారాబాద్ తాండూర్ కు సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 8:30 వరకు కనిపించని వికారాబాద్, తాండూర్ బస్సులు ఆర్టీసీ అధికారులు స్పందించి బస్సులు సకాలంలో నడిచేల చర్యలు తీసుకోవాలని ప్రయాణికులతో కలిసి సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకురాలు వై గీత ఆధ్వర్యంలో బస్టాండ్ లో ఉన్న ఆర్టీసీ అధికారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది.ఈరోజు మహాత్మా గాంధీ బస్టాండ్ ఎంజీబీఎస్ లో సాయంత్రం 6:00 నుండి వికారాబాద్ మరియు తాండూర్ కు ప్రయాణించాల్సిన ప్రయాణికులు చాలామంది బస్సుల కోసం ఎదురుచూస్తూ చిన్నపిల్లలను పెట్టుకొని మహిళలు సంస్థలు పడుతూ ఎంతసేపు ఎదురు చూసిన ఒక బస్ కూడా రాకపోవడంతో బస్టాండ్ లో ఉన్న ఉన్న ఆర్టీసీ అధికారి బస్సుల కోసం అడగగా ప్రతి 10 నిమిషాలకు ఒక బస్సు వస్తాదని చెప్తున్నారు. 

     కానీ దాదాపు రెండు గంటలు వెయిట్ చేసినా ఒక బస్సు రాకపోవడంతో సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కమిటీ సభ్యురాలు వై గీత ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టి ఎంజీబీఎస్ బస్టాండ్ లో విధులలో ఉన్నటువంటి కంట్రోలర్ కు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. కొంతమంది ప్రయాణికులు స్పందిస్తూ గత నెల రోజులుగా ఇదే పరిస్థితి కొనసాగుతా ఉంది కొన్ని బస్సులు మెహిదీపట్నం వరకే వచ్చి రిటర్న్ వెళుతున్నాయి.ఎంజీబీఎస్ లో ఉన్న ప్రయాణికులు రాత్రిపూట ఎటు పోవాలో అర్థం కాక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది అని చెప్పడం జరిగింది. దీనిపైన ఆర్టీసీ తాండూర్ మరియు వికారాబాద్ అధికారులు స్పందించి డిపో నుండి బయలుదేరిన ప్రతి బస్సు ఎంజీబీఎస్ బస్టాండ్ పోయి రిటన్ వచ్చేలాగా అదే విధంగా అన్ని బస్సులు సకాలంలో టైం కు నడిచే విధంగా చర్యలు తీసుకోవాలని వినతిపత్రంలో పేర్కొనడం జరిగింది.కార్యక్రమంలో ప్రయాణికులు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies