పిల్లలు బరువు పెరగడం ఎలా ?
ఆరోగ్యం Health : బరువు పెరగడానికి ముందుగా మీ శరీర తత్వం పట్ల మీకు అవగాహన చాలా ముఖ్యం. మీ పేరెంట్స్ కూడ తక్కువ బరువు ఉన్నారా జన్యువుల పరంగా చూస్తే కొందరు ఎంత తిన్నా లావు అవ్వరు. లావు కావాలంటే ముఖ్యమైనది High Protein Food. అయితే రోజు కాస్త ఎక్కువ ప్రోటీన్ తీసుకోండి. మరి ఎక్కువైతే కిడ్నీ పై చెడు ప్రభావం పడొచ్చు. High Protein కొరకు మీరు non- veg అయితే చికెన్ మటన్, ఫిష్, ఎగ్, రొయ్య వీటిని రెగ్యులర్ గా రోజు లేదా రోజు విడిచి రోజు 50 grams తీసుకోండి. ఒకేసారి 250 / 500grams ఫలితం ఇవ్వవు Sunday కాస్త ఎక్కువగా 200 గ్రామ్స్ తీసుకున్నా పర్వాలేదు.
Veg అయితే పాలు రోజు చిన్న గ్లాస్ రోజు 1 గుడ్డు ( తినేటట్లు అయితే) కొన్ని నెలల పాటు తీసుకోండి. సోయాబీన్ లో అత్యధిక ప్రోటీన్స్(100గ్రాములకు 44 గ్రాములు) ఉంటాయి. సోయాబీన్ పౌడర్ రోజు పాలలో 20 grams కలుపుకొని తాగండి రోజు ఆహారంలో మినుములు, పెసలు,బఠాణీలు అలసందలు వేరుశనక్కాయలు వీటిలో రోజు ఏదోఒకటి కనీసం 30 grams ఉండేలా చూసుకోండి. గుగ్గుళ్ళ రూపంలో సాయంత్రం స్నాక్ గా తినవచ్చు. మినుములతో సున్నుండలు చేసుకొని రోజు విడిచి రోజు ఒకటి తినండి. సున్నుండలు ఒకసారి చేస్తే 2 వారాలు నిల్వ ఉంటాయి.బాదం పప్పు రోజు రాత్రి 4–5 నానబెట్టి ఉదయం పొట్టు తీసి తినండి.
జీడిపప్పు కూడా తినవచ్చు.మీరు Non-Veg / Veg అయితే ఒకే రకమైన ప్రోటీన్ కాకుండా రోజు 2 రకాల ప్రోటీన్( ఒకటి nonveg,2 వది veg) తీసుకోండి. ఒక రోజు చికెన మరొక రోజు మటన్,మరొక రోజు ఫిష్ రొయ్య ఇలా Veg అయితే కూడా పైన తెలిపిన పప్పు ధాన్యాలు రోజు మార్చి తినండి.రోజు పాలు ఇష్టం లేకపోతే రాగి మాల్ట్ మొలకలు వచ్చి పౌడర్ గా చేసిన రాగుల పొడి తో తాగండి. అందులోనే కొన్ని పాలు, బెల్లం చక్కెర బదులు వేసుకోండి. మీకు లభ్యం అయితే రోజు ఒక గ్లాస్ ఫ్రెష్ చెరుకు రసం ( Sugarcane Juice ) తాగండి ( కొన్ని నెలల పాటు ).
దీనిలో విటమిన్ B12 ఉంటుంది హీమోగ్లోబిన్ కూడా పెరుగుతుంది.మీరు నివాసం ఉన్న ప్రాంతంలో పండే ఆహారానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వండి. సిమ్లా ఆపిల్, పియర్స్, కివి ఇవి మనకు వంటబట్టవు. సమయం లేకపోతే Protinex / B- Protein పౌడర్ పాలలో రోజు ఒక spoon కలుపుకొని తాగండి. వేళకు తినండి వేళకు నిద్రించండి లేకుంటే ఆహారం సరిగా absorb అవ్వదు. అయినా కూడ ఫలితం 2,3 నెలల్లో కనబడకపోతే హీమోగ్లోబిన్, B12 విటమిన్( ఇది చాలా ముఖ్యం) పరీక్షలు, డాక్టర్ల ( Gastro Enterologist) / డైటిషియన్ & నుట్రిషనిస్ట్ సలహాతో చేయించుకొని, వారు చెప్పినవి పాటించండి. B12 విటమిన్ లోపం వల్ల కూడా తిన్నది వంటబట్టక, చాలా మంది లావు కారు.




