అల్లాపూర్ గ్రామాన్ని సందర్శించిన స్పెషల్ ఆఫీసర్ తహశీల్దార్ వెంకటేశం
బషీరాబాద్ Basheerabad News భారత్ ప్రథినిధి : వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం అల్లాపూర్ గ్రామాన్ని మంగళవారం రోజున స్పెషల్ ఆఫీసర్ మండల తాసిల్దార్ వెంకటేశం వైకుంఠ ధామం, డంపింగ్ యార్డ్ నర్సరీ, సందర్శించి గ్రామపంచాయతీ రికార్డ్స్ లను పరిశీలించడం జరిగింది.ఈ సందర్భంలో స్పెషల్ ఆఫీసర్ తాసిల్దార్ వెంకటేశం మాట్లాడుతూ మురుగు కాలువలను శుభ్రం ఉండాలి.వేసవిలో మంచి నీటి కొరత రాకుండా చూడాలని, గ్రామీణ ఉపాధి పథకం మంజురైన పనులు ప్రతి ఒక్కరితో చేయించాలని అన్నారు. వైకుంఠ దామము క్రీడ ప్రాంగణం, నర్సరీ మొక్కలు డంపింగ్ యార్డ్ వాటిని సక్రమంగా చూసుకోవాలని పేర్కొన్నారు.గ్రామాలలో అభివృద్ధి విషయంలో ఎటువంటి సమస్య రాకుండా చూడాలని తెలిపారు.ఈ యొక్క కార్యక్రమంలో విలేజ్ సెక్రెటరీ ఉషా,తదితరులు పాల్గొన్నారు.





