బ్రష్ చేస్తుంటే రక్తం వస్తుందా నిర్లక్ష్యం వద్దు ఎందుకంటే
ఆరోగ్యం Health News భారత్ ప్రతినిధి : చిగుళ్లనుంచి రక్తం రావడం అనేవి చాలామందిలో కనిపించేదే. బ్రష్ చేసుకుంటున్నప్పుడు ఇలా కనిపించటం మామూలే. బ్రష్ పాతబడినా, చిన్న ఇన్ఫెక్షన్స్ వచ్చినా వస్తుంది. అయితే ఇది రెగ్యులర్ కనిపిస్తుంటే మాత్రం లైట్ తీసుకోవద్దు. పంటి సమస్యలు చాలావరకు మన ఇమ్యూనిటీ పవర్ మీదే ఆధారపడి వస్తాయి. అందుకే చిగుళ్లలో రక్తస్రావం రెండు మూడు రోజులకంటే ఎక్కువగా కంటిన్యూ అయితే మాత్రం కొద్దిగా ఆలోచించాల్సిందే.
సరైన ఓరల్ హైజీన్ లేకపోతే చిగుళ్ల దగ్గరపాచి వస్తుంది. దాన్ని అలాగే వదిలేస్తే చిగుళ్ళ వాపు, రక్తం కావడం వంటి సమస్యలొస్తాయి. దీనికి వెంటనే ట్రీట్ మెంట్ తీసుకోకపోలే ఇన్ఫెక్షన్ పెరిగి పెరియోడాంటైటిస్ గా మారుతుంది. అంటే పన్నుకి ఉండే బేస్ కుళ్లిపోయి పన్ను తీసేయటమే కాదు ఆ ఇన్ఫెక్షన్ మిగతా పళ్లకి కూడా పాకుతుంది. ఇది మరింత ప్రమాదకరం. ఇదంతా మనం సరిగా బ్రష్ చెయ్యకుంటే వచ్చే సమస్య ఒక్కోసారి లుకేమియా, హీమోపీబియా లాంటి జబ్బులు ఉన్నా రక్తం వస్తుంది.
మన బాడీలో విటమిన్ సి. విటమిన్ కే లోపాలున్నా హార్మోనల్ తేడాలున్నా కట్టుడు పళ్లున్నా కూడా ఈ సమస్య వస్తుంది. అందుకే చిగుళ్లనుంచి రక్తం వస్తుంటే ఎక్కువరోజులు నిర్లక్ష్యం చెయ్యొద్దు. చిగురు వాపు, చిగుళ్ళు రంగుమారటం, ఎర్రబడటం నోరు చెడువాసన రావడ, నోట్లో రుచి తేడాగా అనిపించడం. పళ్ళు కదలడం, బ్రష్ చేస్తుంటే రక్తం కారడం, పళ్ళు బాగా సెన్సిటివ్ అయిపోవటం లాంటి ప్రాబ్లమ్స్ అన్నింటికి దాదాపుగా ఇంట్లోనే ట్రీట్ మెంట్ చేసుకోవచ్చు.
లవంగ నూనె : ఇందులో ఉండే యూజనాల్ వల్ల నొప్పి తగ్గుతుంది. ఒక టీ స్పూన్ కొబ్బరి నూనెలో రెండు, మూడు చుక్కలు లవంగనూనె కలిపి రోజుకి రెండు సార్లు చిగుళ్ళకి దాసి పది నిమిషాల తరవాత నీళ్లతో పుక్కిలించాలి.
ఉప్పు నీళ్లు : ఇందులో ఉన్న యాంటీ ఇన్ ఫ్లమేటరీ. యాంటీ సెప్టిక్ నేచర్ వల్ల వల్ల వాపు తగ్గుతుంది. ఒక కప్పు గోరువెచ్చని నీళ్లలో ఒక స్పూన్ ఉప్పు వేసి రోజుకి మూడుసార్లు ఈ నీళ్లతో పుక్కిలించాలి.
తేనె : చిగురు దగ్గర ప్లేక్ ఏర్పడకుండా చేస్తుంది. ఒక టేబుల్ స్పూన్ తేనెని చిగుళ్ళ మీద వేలితో గుద్దాలి. దీనివల్ల చిగుళ్లకి రక్త సరఫరా బాగా జరుగుతుంది. పళ్లదగ్గర వచ్చే ఫ్లేక్ రాకుండాచేస్తుంది.
క్రాన్ బెర్రీ జ్యూస్ : బ్రష్ చేస్తున్నా కొద్దిగా ప్లేక్ ఏర్పడుతున్నట్లు అనిపిస్తే రోజుకు ఒకసారైనా చక్కెర వెయ్యకుండా క్రాన్ బెర్రీ జ్యూస్ తాగాలి. లేకుండా కొద్దికొద్దిగా నోటినుంచి తీసుకుంటూ ఉంటే ఫ్లేక్ పోతుంది. అయితే ఎక్కువ నాగకూడదు. చక్కెర వెయ్యకూడదు అనే రూల్స్ మాత్రం సైక్ట్ గా ఫొటో ఇవ్వాల్సిందే.
పసుపు : పసుపులో ఉన్న కుర్కుమిన్ ఫేక్ ఏర్పడకుండా చేసి వాపు లేకుండా చేస్తుంది. అరటీస్పూన్ ఆవనూనెలో అరటీస్పూన్ ఉప్పు, ఒక స్పూన్ పసుపూ వేసి కలిపి పేస్ట్ ని చిగుళ్ళకి పట్టించి సున్నితంగా మసాజ్ చేయాలి ఇది పొద్దున, మధ్యాహ్నం చేయటం వల్ల రిజల్ట్ త్వరగా కనిపిస్తుంది.
పేజీ పెప్పర్మెంట్ ఆయిల్ : ఇవి నోటిని క్లీన్ గా ఉంచుతాయి. మూడు చుక్కల కొబ్బరినూనెలో రెండు చుక్కలు పేజ్ గానీ పెప్పర్ మింట్ ఆయిల్ గానీ కలపాలి. దీన్ని టూత్ పేస్ట్ మీద వేసి రోజుకి రెండుసార్లు బ్రష్ చేసుకోవాలి. దీనివల్ల నోటినుంచి వచ్చేవాసన తగ్గుతుంది. పళ్లమధ్య ఉండే ఫుడ్ పార్టికిల్స్ ఈజీగా పోతాయి.
Bleeding from the gums is common in many people. This is normal to see while brushing. It comes when the brush is old and has minor infections. But if it looks regular then don't take light. Dental problems mostly depend on our immunity power. That's why if the bleeding in the gums continues for more than two or three days, you have to think a little.
If there is no proper oral hygiene, plaque will appear near the gums. If it is left as it is, it will cause problems like gum swelling and bleeding. If this is not treated immediately, the infection will develop into periodontitis. This means that the base of the tooth is not only rotten and the tooth is removed, but the infection also spreads to the other teeth. It is more dangerous. If we don't brush all this properly, the problem is sometimes blood comes out even if we have diseases like leukemia and hemophilia.
Vitamin C in our body. Vitamin K deficiencies, hormonal differences or dentures can also cause this problem. That's why if the gums are bleeding, don't ignore it for a long time. Swelling of the gums, discoloration of the gums, redness, bad breath, taste difference in the mouth. Almost all the problems like teeth moving, bleeding while brushing and teeth becoming very sensitive can be treated at home.
మరిన్ని వార్తల కోసం....
* ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టు బెయిల్ ఇక్కడ క్లిక్ చేయండి
* యూట్యూబ్ ప్రీమియం ప్లాన్ల ధరలు పెంపు ఇక్కడ క్లిక్ చేయండి
* సీజనల్ ఫీవర్స్ ఏ జ్వరాన్ని ఎలా గుర్తించాలి ఇక్కడ క్లిక్ చేయండి
* ఇరానీ టీ ఇంట్లోనే తయారు చేసుకోండి ఇలా ఇక్కడ క్లిక్ చేయండి
* 6 లక్షల ఉద్యోగాలతో యాపిల్ వేల కోట్ల పెట్టుబడులు ఇక్కడ క్లిక్ చేయండి
* జున్ను తినడం వల్ల అద్భుతమైన ప్రయోజనాలు ఏంటో తెలుసా ఇక్కడ క్లిక్ చేయండి
* వేడి వేడిగా అన్నం తింటున్నారా ఇదిగో ఇలాంటి సమస్యలు వస్తాయి ఇక్కడ క్లిక్ చేయండి
* అర గంట ఒళ్లొంచి ఇంటి పని చేస్తే గుండె జబ్బు వచ్చే ఛాన్స్ తక్కువ ఇక్కడ క్లిక్ చేయండి
* చెప్పులు షూ లేకుండా నడిస్తే ఇన్ని లాభాలా ఇన్నాళ్లు ఎలా మిస్ అయ్యాం ఇక్కడ క్లిక్ చేయండి





