సీజనల్ ఫీవర్స్ ఏ జ్వరాన్ని ఎలా గుర్తించాలి
ఆరోగ్యం Health News భారత్ ప్రతినిధి : వానాకాలం అంటే జల్లులతో కూడిన ఆహ్లాదకరమైన వాతావరణం కనిపిస్తుంది. అదే సమయంలో చుట్టూ ఉన్న పరిసరాలు ఎన్నో రకాలైన సూక్ష్మజీవులు పెరగడానికి అనువుగా ఉంటాయి. దీంతో సీజనల్ వ్యాధులు డేంజర్ బెల్స్ మోగిస్తుంటాయి. ప్రత్యేకించి ఈ మధ్య స్వల్ప విరామంతో అడపాదడపా కురుస్తున్న వానలతో దోమల వృద్ధి పెరిగింది. దీంతో డెంగీ, మలేరియా, చికున్‌గున్యా లాంటి విషజ్వరాలు ప్రబలుతున్నాయి. ఇక వాతావరణంలో మార్పుల కారణంగా జలుబు,దగ్గు, జ్వరం పీడిస్తున్నాయి. సీజనల్ ఫీవర్స్ను ఎలా గుర్తించాలో తెలుసుకుందాం.
రోజూ వర్షాలు కురుస్తుండడంతో వీధుల్లో నీరు నిల్వ చేరుతోంది. దోమలు వ్యాప్తి చెందుతుండడంతో సీజనల్ వ్యాధుల విజృంభణ ప్రారంభమైంది. ఈ క్రమంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. వ్యక్తిగత శుభ్రత పాటించాలని సూచిస్తున్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని వెల్లడిస్తున్నారు. జ్వరం జలుబు వచ్చిన వెంటనే చికిత్స పొందాలని కోరుతున్నారు. ప్రాణాంతకం కాకముందే ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
టైఫాయిడ్ జ్వరాన్ని ఎట్లా గుర్తుపట్టాలి
మామూలు వారం రోజు రోజుకీ తగ్గుతుంది. టైఫాయిడ్ జ్వరం పొద్దున తక్కువుగా ఉంటుంది. సాయంత్రానికి బాడీ చెంపరేచర్ పెరుగుతుంది. రాత్రికల్లా హైటెంపరేచర్ కు చేరుకుంటుంది. ఒళ్లు నొప్పులు, పొట్టలో నొప్పి ఉంటాయి. టైఫాయిడ్ వస్తే బాడీ టెంపర్ చర్ పెరుగుతూ ఉంటుంది. కానీ తగ్గదు ఈ లక్షణం ఆధారంగా జ్వరాన్ని టైఫాయిడ్ గా అనుమానించాలి
బైఫాయిడ్ ఎందుకొస్తుంది
మనం తినే ఆహారం. తాగే నీళ్లు కలుషితం కావడం వల్ల టైఫాయిడ్ వస్తుంది. వర్షాకాలంలో నీటి కాలుష్యం ఎక్కువ కలుషిత నీటిలో సాల్మొ నెల్లా బ్యాక్టీరియా ఉంటుంది.సాల్మొ నెల్లా బ్యా క్టీరియా శరీరంలోకి ప్రవేశిస్తే చర్మంపై ఎర్రని మచ్చలు (రోజ్ స్పాట్స్) ఏర్పడతాయి. నాలుగు రోజులు ట్రీట్ మెంట్ చేస్తే తగ్గిపోతుంది. రెండు వారాలపాటు మందులు వాడాలి.
ప్లాస్మోడియం వైవాక్స్ ప్లాస్మోడియం ఫాల్సిఫెరం అనే వైరస్ వల్ల మలేరియా వస్తుంది. మలేరియాకు మూడు రోజులు, అయిదు రోజుల కోర్సు ఉంది. ఈ మందులు వేసుకుంటే ఈజీగా తగ్గు తుంది. రోగ తీవ్రత కారణాలను బట్టి మూడు రోజులు అయిన రోజులు కోర్సు వాడాలి.
స్వైన్ ఫ్లూ వస్తే రెండో రోజు. మూడో రోజు జ్వరం, ఒళ్లు నొప్పులు, దగ్గు, తలనొప్పి పెరుగుతాయి. నెమ్మదిగా ఆయాసం వస్తుంది. మామూలు జ్వరానికి నాలుగైదు రోజులకు లంగ్ ఎఫెక్ట్ అవుతుంది. కానీ స్వైన్ ఫ్లూ వస్తే మాత్రం రెండో రోజే లంగ్ ఇన్ఫెక్ట్ అవుతుంది.
డెంగ్యూ ఫీవర్
డెంగ్యూ ఫీవర్ ఏడిస్ అనే జాతికి చెందిన దోమలు కుట్టడం వల్ల వస్తుంది. ఈ దోమల్లో డెంగ్యూ వైరస్ లు ఉంటాయి. దోమ కుట్టినప్పుడు ఇవి రక్తంలోకి చేరతాయి. తీవ్రమైన జ్వరం. కీళ్ల నొప్పులు ఉంటాయి. డెంగ్యూకి కారణమైన ఏడిస్ దోమ ఎక్కువగా పగటి వేళల్లోనే కుడుతుంది. పగలు దోమలు కుట్టకుండా జాగ్రత్త పడాలి. డెంగ్యూ జ్వరం వల్ల రక్తంలో ప్లేట్ లెట్స్ తగ్గుతాయి. చిగుర్లు, కండరాల్లో రక్తస్రావం అవుతుంది.
రైనో వైరస్ : ఈ వైరస్ వల్ల జ్వరంతోపాటు ఇతర సమస్యలు కూడా ఉంటాయి. ఎక్కువ మంది ఈ జ్వరంతోనే బాధపడుతుంటారు.
లక్షణాలు : తుమ్ములు లో జ్వరం తలనొప్పి గొంతునొప్పి దగ్గు కండరాల నొప్పులు ఆకలి లేకపోవడం
స్వైన్ ఫ్య్లూ: ఇన్ ఫ్య్లుయెంజా వైరస్ ల వల్ల వచ్చే జ్వరాన్ని స్వైన్ ఫ్య్లూఅంటారు. ఈ వైరస్ లు నాలుగు రకాలు. హెచ్1 ఎస్1, హెచ్ 1ఎన్2 ,హెచ్3 ఎస్ 1,హెచ్3 ఎస్ 2. కె వీటిలో హెచ్1 ఎన్1 వైరస్ వల్లనే ఎక్కువ మందికి స్వైన్ ఫ్లూ సోకుతోంది.
లక్షణాలు : జ్వరం ఒళ్లునొప్పులు దగ్గు తలనొప్పి గొంతునొప్పి అలసట
జ్వరానికి పండ్ల రసాలే మందు కొన్ని వైరస్ లు నీళ్లు, ఆహారం ద్వారా మన శరీరంలోకి ప్రవేశిస్తాయి. ఇవి ప్రాణాలు తీసేవేమీ కాదు. నీళ్లు, ఆహారం ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తాయి. కాబట్టి జీర్ణ సంబంధమైన సమస్యలు తీవ్రంగా ఉంటాయి. కడుపులో నొప్పి, నీళ్ల విరేచ నాలు, వాంతులు, తలనొప్పి వస్తాయి. కొందరిలో దగ్గు కూడా ఉంటుంది.
ఈ సమస్యలేవీ ప్రమాదం కాకున్నా బాడీ డీ హైడీషన్ (శరీరం నుంచి నీరు బయ టిడిపోవడం) వల్ల బీపీ తగ్గిపోవడం వల్ల ప్రాణాంతకంగా మారొచ్చు. ఇలాంటి జ్వరాలు వస్తే ఓఆర్ ఎస్ నీళ్లు, పండ్ల రసాలు, జావలాంటివి తీసుకుంటే ఏమీ కాదు, డీహైడ్రేషన్ మెయింటెయిన్ చేస్తే త్వరగా కోలుకుంటారు. వాంతులు, విరోచనాలు రెండో రోజు తగ్గకపోతే హాస్పిటల్ కు పోవాలి.
Monsoon means pleasant weather with showers. At the same time, the surrounding environment is suitable for the growth of many types of microorganisms. Due to this seasonal diseases ring danger bells. Especially with the recent intermittent rains, the growth of mosquitoes has increased.
As it rains every day, water is accumulating in the streets. Seasonal diseases began to flourish with the spread of mosquitoes. Doctors warn people to be alert in this order. Personal hygiene is recommended. It is revealed that the environment should be kept clean. Want to get treatment immediately after fever cold. Medical experts suggest taking precautions before it becomes fatal.
How to recognize typhoid fever : A typical week goes down day by day. Typhoid fever is mild in the morning. Body temperature increases in the evening. It reaches high temperature at night. There are pains in the throat and pain in the stomach. If typhoid occurs, the body temperature rises. But it does not decrease. Based on this symptom, the fever should be suspected as typhoid.
Although none of these problems are dangerous, they can become life-threatening due to a drop in BP due to body dehydration. If you get such fevers, if you take ORS water, fruit juices, java etc., it is nothing, if you maintain dehydration, you will recover quickly. If the vomiting and diarrhea do not subside on the second day, you should go to the hospital.





