ఇవి తింటే ఒత్తిడి తగ్గుతుంది
ఆరోగ్యం Health News భారత్ ప్రతినిధి : మారుతున్న జీవన విధానం పొద్దున లేస్తే చాలు ఉరుకులు పరుగుల జీవితం ఏదో ఒక పని టెన్షన్ ఒత్తిడి ఇలా బతకలేక బతుకుతున్నాం. ఇక అంతేనా ఒత్తిడి ఎక్కువ అయితే అనేక ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నాం. అనేక రకాల సమస్యల వల్ల స్ట్రెస్‌కు గురవుతుంటారు. ఆందోళన కారణంగా అనేక మానసిక సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. స్ట్రెస్ తగ్గించుకోవడానికి కొన్ని రకాల ఆహార పదార్థాలను డైట్ లో భాగంగా చేసుకోవడం ఎంతైనా అవసరం. ఏఏ ఆహార పదార్థాలు ఆందోళన తగ్గించడానికి ఉపయోగపడతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
మారిన జీవన శైలి కారణంగా చాలా మంది ఆందోళనకు గురవుతున్నారు. ఉద్యోగ వ్యాపార పనుల వల్ల ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి నిద్ర పోయే వరకు సమస్యలతో ఒత్తిడి ఇబ్బంది పడుతున్నారు. ఒత్తిడి కారణంగా రక్తపోటుతో పాటు ( BP) , షుగర్ వంటి అనారోగ్య సమస్యలు కూడా వస్తాయి. అందుకే ఆరోగ్యంగా ఉండటం కోసం ఒత్తిడిని తగ్గించుకోవాలి.
చేపలు : చేపల్లో అనేక పోషకాలు ఉంటాయి. విటమిన్లు పుష్కలంగా ఉండే ఆహార పదార్థాల్లో చేపలు కూడా ఒకటి సాల్మన్, సార్డినెస్ వంటి చేపల్లో ఒమేగా 3 ఫ్యాటీ కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆందోళనను తగ్గించడంలో ఉపయోగపడతాయి. చేపలను తరుచుగా ఆహారంతో భాగంగా చేర్చుకోవడం వల్ల స్ట్రెస్ తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు.
డ్రై ఫ్రూట్స్ : ఇవి ఒత్తిడిని తగ్గించేందుకు చాలా బాగా ఉపయోగపడతాయి. వాల్ నట్స్, బాదం, గుమ్మడి కాయ గింజలతో పాటు డ్రై ఫ్రూట్స్ లల్లో హెల్ధీ ఫ్యాట్స్ అధికంగా ఉంటాయి. ఇవి మానసిక ఒత్తిడిని తగ్గించడంలో ఉపయోగపడతాయి. వీటిని తరుచుగా తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని నిపుణుగు చెబుతున్నారు.
ఆకు కూరలు : వీటిలో విటమిన్లు, ఖనిజాలు యాంటీ ఆక్సిడెంట్లు ఫుష్కలంగా ఉంటాయి. ఆకుకూరల్లో ఉండే మెగ్నీషియంతో పాటు ఇతర పోషకాలు ఒత్తిడిని తగ్గించడానికి చాలా బాగా ఉపయోగపడతాయి. తరుచూ స్ట్రెస్ తో బాధపడేవారు వీటిని ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి.
పెరుగు : ప్రోటీన్లతో పాటు ప్రోబయోటిక్స్ పెరుగులో పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తాయి. అంతే కాకుండా ఒత్తిడిని కూడా తగ్గిస్తాయి. రోజు ఒక కప్పు పెరుగును ఆహారంలో భాగంగా చేర్చుకోవడం వల్ల ఒత్తిడి చాలా వరకు తగ్గుతుంది.
డార్క్ చాక్లెట్ : యంటీ ఆక్సింట్లతో పాటు, ఫ్లెవనాయిడ్స్ డార్క్ చాక్లెట్ల లో ఎక్కువగా ఉంటాయి. ఇవి ఒత్తిడిని తగ్గించి మానసిక స్థితిని మెరుగుపరుస్తాయి. తరుచుగా చాక్లెట్ తినడం వల్ల ఒత్తిడి తగ్గుతుందని ఒక పరిశోధన ద్వారా వెల్లడైంది. స్ట్రెస్‌గా ఫీల్ అయినప్పుడు డార్క్ చాక్లెట్ తినడం వల్ల రిలీఫ్ పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు.
If we wake up early in the changing way of life, we can't live like this. Even if the pressure is high, we are troubled with many health problems. People are stressed due to many types of problems. Experts say that anxiety causes many psychological problems. In order to reduce stress, it is necessary to make certain types of foods a part of the diet.
Many people are worried because of the changed life style. Due to work and business work, people are suffering from stress and problems from the time they wake up in the morning to the time they go to sleep at night. Along with high blood pressure (BP), stress also causes health problems like diabetes. That's why stress should be reduced to stay healthy.





