ఫ్రీ ఆధార్ అప్డేట్ గడువు ముగుస్తోంది వెంటనే అప్డేట్ చేసుకోండి
జాతీయ National News భారత్ ప్రతినిధి : స్కూల్ అడ్మిషన్ అయినా బ్యాంకు అకౌంట్ ఓపెన్ చేయాలన్నా ఏదైనా ప్రభుత్వ పథకానికి అప్లై చేసుకోవాలన్నా ఇలా ప్రతి పనికి ఆధార్ తప్పనిసరి అయ్యింది. అయితే, ఆధార్ ఒక్కసారి తీసుకుంటే సరిపోదు ఆధార్ కార్డులో ఏవైనా తప్పులున్నా లేదా అడ్రస్ చేంజ్ చేసుకోవాలన్నా, ఫోన్ నంబర్ మార్చుకోవాలన్నా కుడా ఎప్పటికప్పుడు ఆన్లైన్లో అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే, ఇప్పటిదాకా కేంద్రం ఫ్రీగా ఆన్లైన్లో ఆధార్ అప్డేట్ చేసుకునే సదుపాయం కల్పించింది. దీని గడువు త్వరలోనే ముగియనుంది. సెప్టెంబర్ 14, 2024 నాటికి ఫ్రీ ఆధార్ అప్డేట్ గడువు ముగియనుంది. ఈ లోగా ఆధార్ అప్డేట్ చేసుకోని వాళ్ళు వెంటనే అప్డేట్ చేసుకోండి.
ఆన్లైన్ లో ఆధార్ డెమోగ్రాఫిక్స్ను ఉచితంగా ఇలా అప్డేట్ చేసుకోండి
* uidai.gov.inలో UIDAI అధికారిక వెబ్‌సైట్‌ను లాగిన్ అవ్వండి.
* మై ఆధార్ ఆప్షన్ ని క్లిక్ చేయండి.
* అప్‌డేట్ యువర్ ఆధార్'పై క్లిక్ చేసి, డ్రాప్-డౌన్ మెనులో 'అప్‌డేట్ డెమోగ్రాఫిక్స్ డేటా అండ్ చెక్ స్టేటస్' ను సెలెక్ట్ చేయండి.
* ఆధార్ నంబర్, క్యాప్చా కోడ్‌ను ఎంటర్ చేయండి. తర్వాత, రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌లో వన్-టైమ్ పాస్‌వర్డ్‌ను కోసం "సెండ్ OTP" ఆప్షన్ పై క్లిక్ చేయండి.
* లాగిన్ చేయడానికి మరియు జనాభా వివరాలను యాక్సెస్ చేయడానికి OTPని ఎంటర్ చేయండి, ఇక్కడ మీరు అవసరమైన మార్పులు చేసుకోవచ్చు.
* డీటెయిల్స్ అప్డేట్ చేసిన తర్వాత, చేంజెస్ సేవ్ చేసే ముందు అవసరమైన డాకుమెంట్స్ అప్‌లోడ్ చేయండి.
* చేంజెస్ సేవ్ చేసిన తర్వాత, మీరు మీ రిజిస్టర్డ్ నంబర్‌లో అప్‌డేట్ అభ్యర్థన IDని అందుకుంటారు, దాన్ని మీరు తర్వాత స్థితిని ట్రాక్ చేయడానికి ఉపయోగించవచ్చు.
Aadhaar has become mandatory for every task like school admission, opening a bank account, applying for any government scheme. However, taking Aadhaar once is not enough, if there are any mistakes in the Aadhaar card or if you want to change your address or change your phone number, you have to update it online from time to time.
However, so far the center has provided the facility to update Aadhaar online for free. It will expire soon. Free Aadhaar update will expire on September 14, 2024. Those who have not updated Aadhaar in this way should update it immediately.





