Type Here to Get Search Results !

Sports Ad

ఈ విషయం మీకు తెలుసా దిండు పెట్టుకుంటే మొటిమలు వస్తాయి Do You Know This Thing If You Put A Pillow On It You Will Get Pimples

ఈ విషయం మీకు తెలుసా దిండు పెట్టుకుంటే మొటిమలు వస్తాయి

ఆరోగ్యం Health News భారత్ ప్రతినిధి : చాలామందికి మొటిమలు ఓ శాపంలా మారతాయి. ఎంత అందమైన ముఖాన్ని అయినా కళావిహీనంగా మార్చేస్తాయి. మొటిమలు, వాటి మచ్చలు, మొటిమల గుంతలు వంటి సమస్యలు అందాన్నే ఆవిరి చెసేస్తాయి. అయితే, కొంతమందికి ముఖంపై ఎక్కడ వెతికినా మొటిమలు అనే జాడే కనిపించదు. అలాంటి వారిని చూసి మొటిమలతో బాధపడేవారికి ఈర్ష్య కలుగుతుంది. అందాన్ని దెబ్బతీసే మొటిమలతో సహా, శ్వాసకోశ వ్యాధులకు దిండ్లు కారణమవుతాయని మీకు తెలుసా ఇలాంటి మరిన్ని విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

 మగువుల అందాన్ని మొటిమలు దెబ్బతీస్తాయి. చాలామంది దిండు లేకుండా పడుకోలేరు. తల కింద పిల్లో  లేనిదే చాలామందికి నిద్రపట్టదు. మెత్తటి పిల్లోతో హాయిగా నిద్ర పోతారు. కానీ ఆ దిండుతోనే అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి.  అందాన్ని దెబ్బతీసే మొటిమలతో సహా, శ్వాసకోశ వ్యాధులకు దిండ్లు కారణమవుతాయని ఓ నివేదికలో వెల్లడయిందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 

 2016లో జర్నల్ ఆఫ్ డెర్మటాలజీ, జర్నల్ లో ప్రచురించిన నివేదిక ప్రకారం దిండులోని బ్యాక్టీరియా మొటిమల తీవ్రతను కూడా పెంచుతుందని పరిశోధనలో వెల్లడైంది. జపాన్‌లోని టోక్యో మెడికల్ అండ్ డెంటల్ యూనివర్సిటీలో చర్మవ్యాధి నిపుణులు ఈ పరిశోధనలో పాల్గొన్నారు. దిండు అపరిశుభ్రంగా ఉండడం వల్ల మొటిమలు వచ్చే అవకాశం ఉందని పరిశోధనలో వెల్లడైంది.

అలర్జీ : మనలో చాలామంది రోజంతా బయట తిరిగి వచ్చిన తర్వాత స్నానం చేయకుండానే బెడ్‌పై వాలిపోతుంటారు. దీని వల్ల దుస్తులపై ఉన్న బ్యాక్టీరియా దుమ్ము, ధూళి కణాలు బెడ్ షీట్లు, తలగడలపై చేరతాయి. తర్వాత మనం పడుకున్నప్పుడు అవి మన శరీరంలోకి చేరి అలర్జీలను కలిగిస్తాయని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి శుభ్రంగా స్నానం చేసిన తర్వాత పడుకోవాలని సూచిస్తున్నారు.

మొటిమలు : తలకింద తలగడ పెట్టుకున్నప్పుడు ముఖంపై ఉన్న దుమ్ము, ధూళి, నూనె, జుట్టు వంటివి దిండుకు అంటుకుంటాయి. దీని వల్ల దిండుపై బ్యాక్టీరియా కూడా పెరిగిపోతుంది. తిరిగి ఇవి ముఖంపైకి చేరతాయి. ఈ కారణంగానే ముఖంపై మొటిమలు కూడా పెరిగిపోతాయని నిపుణులు అంటున్నారు.
బెడ్‌షీట్, దిండుపై ఉన్న బ్యాక్టీరియా తొలగిపోవాలంటే ఎప్పటికప్పుడు వీటిని శుభ్రం చేసుకోవాలి.

Acne is a curse for many people. No matter how beautiful the face, they make it artless. Problems like pimples, their scars and acne pits are steamed away. However, some people do not find any pimples anywhere on their face. People who suffer from acne feel jealous of such people. Did you know that pillows can cause respiratory ailments, including unsightly acne.

 Acne spoils the beauty of the skin. Many cannot sleep without a pillow. Many people cannot sleep without a pillow under their head. Sleep comfortably with a soft pillow. But with that pillow comes many health problems.  Health experts say a report has revealed that pillows can cause respiratory ailments, including unsightly acne.

 According to a 2016 report published in the Journal of Dermatology, the research revealed that the bacteria in the pillow can also increase the severity of acne. Dermatologists at Tokyo Medical and Dental University in Japan participated in the research. Research has revealed that an unclean pillow can lead to acne breakouts.

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies