Type Here to Get Search Results !

Sports Ad

ప్రాధమిక పాఠశాల,ఇండ్ల మధ్యలో పెంట కుప్పలు Garbage piles between the primary school and houses in Ekmai

 

ప్రాధమిక పాఠశాల, ఇండ్ల మధ్యలో పెంట కుప్పలు 

  • ఎంపిడిఓ కు ఫిర్యాదు
  • పిల్లలు అనారోగాల పలు 
  • అంబేద్కర్ యువజన సంఘం యువకులు
  • ఆరోగ్యాన్ని దృష్టిలో తగు చర్యలు

బషీరాబాద్ Basheerabad News : ఇండ్ల మధ్యలో పెంట కుప్పలు తొలగించాలని అంబేద్కర్ యువజన సంఘం యువకులు ఎంపిడిఓ కు ఫిర్యాదు చేసిన యువకులు.బషీరాబాద్ మండలం ఎక్మాయి గ్రామంలో హరిజనవాడలో ప్రాధమిక పాఠశాల ప్రాంతంలో మరియు ఇండ్ల మధ్యలో పెంట కుప్పలు ఉండడంతో విద్యార్థులు అనారోగ్యానికి గురౌతున్నారు.చుట్టూ పక్కల అనేకమైన దోమలు ఉండడం వలన పిల్లలు జ్వరాలు రావడం వాంతులు చేసుకుంటున్నారు.ఈ సమస్య పై అనేక సార్లు పై అధికారులకు ఫిర్యాదు  చేసినప్పటికీ ఫలితం శూన్యం.ఇప్పటికైనా విద్యార్థుల పట్ల దయతలచి ప్రభుత్వ,ఆదేశానుసారముగా పెంట కుప్పలను బయటికి తరలించగలరని ఆరోగ్యాన్ని దృష్టిలో తమరు తగు చర్యలు తీసుకోవాలని ఎంపిడిఓ ని అంబేద్కర్ యువజన సంఘం యువకులు నర్సింలు,కమల్ కుమార్,కాశీనాద్,సాయి రెడ్డి పటేల్, కోరగా త్వరలో ఈ సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies