Type Here to Get Search Results !

Sports Ad

వామ్మో ఎండు కొబ్బరి తింటే ఇన్ని ఉపయోగాలా If You Eat Dry Coconut Do You Use It

వామ్మో ఎండు కొబ్బరి తింటే ఇన్ని ఉపయోగాలా

Health News భారత్ ప్రతినిధి : మొన్న కృష్ణాష్టమి నిన్న వినాయక చవితి ఇప్పుడు గణపతి నిమజ్జనం ఇలా వరుసగా పండుగలొస్తున్నాయి. పండుగలన్నాక ఇంట్లో పూజలు కంపల్సరీ. పూజలన్నాక కొబ్బరికాయలు కొట్టడం కూడా కామనే. అయితే చాలాసార్లు ఈ కొబ్బరి వెంటనే తినరు. అలా కొన్నిరోజులు పెట్టి ఉంచడంవల్ల పాడైపోతుంటుంది. కానీ ఈ కొబ్బరిని ఎండబెట్టుకొని. టైం దొరికినప్పుడల్లా తినాలని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. ఎందుకంటే ఎండు కొబ్బరితో ఎన్నో ప్రయోజనాలున్నాయట. మరి అవేంటో ఓసారి చూద్దాం.

 కొబ్బరిలోపల వాటర్ కంటెంట్ పూర్తిగా ఆవిరైపోవడం వల్ల ఎండు కొబ్బరి మరింత రుచిగా ఉంటుంది. ట్రాన్స్ ఫ్యాట్స్ ఎక్కువగా ఉంటుందని, కొలెస్ట్రాల్ కూడా ఎక్కువేననే అభిప్రాయంతో చాలా మంది ఎండుకొబ్బరి తినడానికి అభ్యంతరం వ్యక్తం చేస్తారు. అయితే డ్రై కోకోనట్ వల్ల శరీరానికి కలిగే మేలు తెలిస్తే మీ అభిప్రాయాన్ని తప్పకుండా మార్చుకుంటారు. ఎండు కొబ్బరిలో ఫైబర్, కాపర్, మాంగనీస్, సెలీనియంతో పాటు అనేక పోషకాలు ఉన్నాయి. 

 లావు తగ్గాలంటే, ఆరోగ్యంగాచలాకీగా ఉండాలంటే లేత కొబ్బరి తినాలని డాక్టర్లు చెబుతారు. లేత కొబ్బరిలో ఎన్నో ప్రోటీన్లు, ఎంజైములు  ఉంటాయి. కానీ ప్రతిరోజూ లేత కొబ్బరి దొరకడం కష్టమే కదా నిజానికి లేత కొబ్బరి కంటే ఎండు కొబ్బరిలోనే పోషకాలు మెండుగా ఉంటాయని చెబుతున్నారు. ఎండు కొబ్బరి అరిగేందుకు కాస్త సమయం తీసుకున్నా దానివల్ల కలిగే ప్రయోజనాలు అన్నీఇన్నీ కావంటున్నారు పోషకాహార నిపుణులు.

హార్ట్ హెల్త్....
డ్రైకోకోనట్ లో డైటరీ ఫైబర్ అధికంగా ఉండటం వల్ల హార్ట్ కు  మేలు చేస్తుంది. మగవాళ్లకు రోజుకు కనీసం 38 గ్రాములు, ఆడవాళ్లను 25 గ్రాముల డైటరీ ఫైబర్ అవసరమవుతుంది.   ఇందుకోసం ఎండు కొబ్బరిని తినడమే ఉత్తమమని  ఆయుర్వేద  నిపుణులు చెబుతున్నారు. ఈ డైటరీ ఫైబర్ వల్ల గుండె సమస్యలు దూరమవుతాయంటున్నారు.

పురుషుల్లో వంధ్యత్వాన్ని నివారిస్తుంది....
ఇది అపోహకాదు, వాస్తవం. డ్రైడ్ కోకోనట్లో ఉండే మినరల్స్ పురుషుల్లో వంధ్యత్వ సమస్యలను నివారిస్తుంది. ఈ విషయాన్ని కొన్ని మెడికల్ టెస్టులు, పరిశోధనల ద్వారా నిరూపించారు. అందుకు కారణం కూడా సెలీనియమే. ఇది పురుషుల్లో ఇన్ఫెర్టిలిటిని తగ్గిస్తుంది.

రక్తహీనతను తగ్గిస్తుంది....
మహిళలు ఒక వయస్సు వచ్చిన తర్వాత అనీమియాకు గురి అవుతుంటారు. ఐరన్ లోపం వల్ల తలెత్తే ఈ సమస్య అనేక అనారోగ్య సమస్య లకు దారితీస్తుం ది. డ్రైడ్ కోకోనట్లో ఐరన్ పుష్కలం. ఇది అనీమియాను నివారిస్తుంది.

కీళ్ల నొప్పులు దూరమవుతాయి....
ఎండు కొబ్బరి రోజూ తింటే కీళ్లనొప్పుల సమస్య ఉండదు. కొబ్బరిలో ఉండే కొన్ని ఖనిజ లవణాలు కండరాలను ఆరోగ్యంగా ఉంచుతాయి.

క్యాన్సర్ రిస్క్ తగ్గిస్తుంది...
ఎండు కొబ్బరిలో ఉండే న్యూటీషియన్స్ క్యాన్సర్ కణాలకు వ్యతిరేకంగా పోరాడతాయి. కొలన్, ప్రొస్టేట్ క్యాన్సర్లను నివారించడంలో డ్రైడ్ కోకోనట్ ఎంతో సహాయపడుతుంది.

జీర్ణ సమస్యలుండవు....
మితంగా ఎండుకొబ్బరి తినడం వల్ల మలబద్దకం, అల్చర్. హెమరాయిడ్స్ వంటి జీర్ణ సమస్యలు పరిష్కారమవుతాయి. పైగా ఎండు కొబ్బరితో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు.

Monna Krishnashtami, yesterday Vinayaka Chavithi and now Ganapati Nimajjanam are celebrated consecutively. Pujas at home are compulsory after festivals. After puja, beating of coconuts is not enough. But many times this coconut is not eaten immediately. Keeping it like that for a few days will spoil it. But dry this coconut.

 Dry coconut tastes better as the water content inside the coconut evaporates completely. Many people object to eating coconut because it is high in trans fats and high in cholesterol. But if you know the benefits of dry coconut for the body, you will surely change your opinion.

 Doctors say to eat tender coconut to lose fat and stay healthy. Tender coconut contains many proteins and enzymes. But it's hard to find tender coconut every day! In fact, it is said that dry coconut has more nutrients than tender coconut.

మరిన్ని వార్తల కోసం.... 
* హైబీపీతో 5 నష్టాలు ఇక్కడ క్లిక్ చేయండి 
* డిగ్రీలో మరో 12,756 మందికీ సీట్లు ఇక్కడ క్లిక్ చేయండి 
* బంగాళదుంపతో ఫేస్​ మారిపోద్ది ఎలాగంటే ఇక్కడ క్లిక్ చేయండి 
* పిల్లలు ఎక్కువగా టీవీ చూస్తే వచ్చే అనారోగ్య సమస్యలు ఇవే ఇక్కడ క్లిక్ చేయండి 

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies