తల తిరగటానికి కారణాలు ఏంటీ ఇది ప్రమాదమా ఏ పరీక్షలు చేయించుకోవాలి
Health News భారత్ ప్రతినిధి : సాధారణంగా ప్రతిఒక్కరికీ ఎప్పుడో ఒకసారి తల, కళ్లు తిరగడం లాంటివి జరుగుతాయి. కానీ ఇలా ఎక్కువసార్లు అవుతుంటే, దాన్ని అనారోగ్యానికి ముందు సూచనగా తీసుకోవాలి. వాటికి కారణాలు తెలుసుకోవాలి. దాన్నిబట్టి అవసరమైన ట్రీట్మెంట్ తీసుకోవాలి. తల తిరిగితే చెవిలో వెస్టిబ్యులార్ సిస్టమ్ దెబ్బతినడం వల్ల వర్ణిగో రావచ్చు. కూర్చున్నా, పడుకున్నా ఒక పక్క నుంచి మరో పక్కకి తిరిగినా తల తిరగడం ఎక్కువ అవుతుంది.
ఇది దాదాపు 5-నుంచి10 సెకండ్ల వరకు ఉండొచ్చు. తల తిరగడం ఎక్కువగా ఉన్నప్పుడు వాంతులు, కళ్లు తిరగడంతోపాటు చెమట కూడా పట్టొచ్చు.చెవి లోపలి ద్రావకంలో గ్రాన్యూల్స్ ఏర్పడటం వల్ల బినాయిన్ వర్ణిగో రావచ్చు. దాంతోపాటు చెవికి ఇన్ఫెక్షన్ జలుబు వచ్చే అవకాశంఉంది.
కళ్లు తిరగడం....
వ్యాధికి గల కారణం నిర్ధారణ అయ్యాక.. పేషెంటీ కి ధైర్యం చెప్పాలి. తర్వాత యాంటీవర్టిగో మందులు, వ్యాయామాలతో వ్యాధిని తగ్గించొచ్చు. మెదడులో కణితి ఉంటే సర్జరీ అవసరమవుతుంది. అలాగే మినియర్స్ వ్యాధి అనేది తరచూ వచ్చేది. ఇందులో తల తిరగటం, చెవిలో హోరు, వినికిడి లోపం వంటివి వస్తాయి. వీటిని ఆశ్రద్ధ చేస్తే, శాశ్వతంగా చెవులు వినపడకుండా పోయే ప్రమాదం ఉంది.
వ్యాధి నిర్ధారణయ్యాక డాక్టర్ పర్యవేక్షణలోనే చికిత్స తీసుకోవాలి. టూ వీలర్ పై ప్రయాణం చేయకూడదు. హై బీపీ ఉంటే మందులు వాడాలి. మానసిక ఒత్తిడి నుంచి బయటపడేందుకు యోగా, మెడిటేషన్ చేయాలి.
కళ్లు తిరగడానికి గల కారణాలు....
తలకి తగిలిన దెబ్బలు (రోడ్ ప్రమాణాలు), వాహన ప్రయాణంలో కదలికలు (ట్రావెల్ సిక్ నెస్), వైరస్ తో వ్యాపించే ఇన్ ఫెక్షన్లు, లోపలి చెవి సర్డర్ తర్వాత, పెద్దపెద్ద శబ్దాలు దగ్గరగా విన్నప్పుడు, చెవిలో చీము పట్టినప్పుడు, రాయిలా గట్టిగా చెవిలో గులిమి ఏర్పడినప్పుడు, మెడ ఎముకల అరుగుదల (సర్వైకల్ స్పాండిలోసిస్), కంటిచూపులో మార్పులు, హై లేదా లో బీపీ, మెదడులో కణితి, నిద్ర నుంచి హఠాత్తుగా లేచినా, తలను ఒక వైపు నుంచి పక్కకు తిరి తిరుగుతుంది, తరచుగా కళ్లు తిరుగుతుంటే ఎందుకు తిరుగుతున్నాయో ఎలాంటి వ్యాధి తో సంబంధం ఉందో తెలుసుకొనేందుకు కొన్ని రకాల పరిక్షలు చేయించుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
వ్యాధి నిర్ధారణ పరీక్షలు ఇవే....
చెవి పరీక్ష, ఆడియాలజీ పరీక్షలు, వెస్టిబ్యూలార్, ఐఎన్ జీ, క్యాలోరిక పరీక్షలు, రక్తపరీక్షలు, మధుమేహం, కొవ్వు (కొలెస్ట్రాల్) పరీక్షలు, మెడ ఎక్స్ రే లాంటి పరీక్షలు చేయించుకుని ట్రీట్ మెంట్ తీసుకోవాలి.
In general, everyone experiences dizziness at some point. But if this happens more often, it should be taken as an indication of illness. The reasons for them should be known. Accordingly, the necessary treatment should be taken. Varnigo can occur due to damage to the vestibular system in the ear if the head is turned.
It can be around 5 to 10 seconds. Vomiting, dizziness, and sweating may occur when the dizziness is severe. Binain color may occur due to the formation of granules in the inner ear fluid. Along with that there is a possibility of ear infection cold.





