ఫ్యాన్స్ పండగ చేసుకోండి 2027 వన్డే వరల్డ్ కప్‌కు కోహ్లీ, రోహిత్
Sports News క్రీడా వార్తలు భారత్ ప్రతినిధి : ఎవరన్నారు వయసైపోతుంది అని ఎవరన్నారు ఫిట్ నెస్ లేదని ఎవరన్నారు ఫామ్ లేదని ఎవరన్నారు రిటైర్మెంట్ అవ్వాలని టీమిండియా స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలపై వస్తున్న విమర్శలకు ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచి చూపించి చెక్ పెట్టారు. జట్టుకు అనుభవం ఎంత కీలకమో తెలిసేలా చేశారు. కీలకమైన సెమీ ఫైనల్లో విరాట్ కోహ్లీ 84 పరుగులు చేసి ఆస్ట్రేలియాపై మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడితే ఫైనల్లో న్యూజిలాండ్ పై రోహిత్ శర్మ 76 పరుగులు చేసి టైటిల్ గెలవడంతో కీలక పాత్ర పోషించాడు. ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత ఇద్దరూ రిటైర్మెంట్ ప్రకటిస్తారనే వార్తలు వచ్చినా అందులో వాస్తవం లేదని రోకో జోడీ తేల్చేశారు.