Type Here to Get Search Results !

Sports Ad

మూడోసారి చాంపియన్స్ ట్రోఫీ విజేతగా ఇండియా India Wins Champions Trophy For The Third Time

మూడోసారి చాంపియన్స్ ట్రోఫీ విజేతగా ఇండియా

Sports News క్రీడా వార్తలు భారత్ ప్రతినిధి : అరబ్‌‌ గడ్డపై టీమిండియా అద్భుతాన్ని ఆవిష్కరించింది.  ఎనిమిది మేటి జట్లు పోటీ పడ్డ  ఐసీసీ చాంపియన్స్ టోర్నీలో విజేతగా నిలిచి అసలైన చాంపియన్ అనిపించుకుంది. దుబాయ్ ఇంటర్నేషనల్​ క్రికెట్ స్టేడియంలో ఆదివారం జరిగిన ఫైనల్లో ఇండియా 4 వికెట్ల తేడాతో న్యూజిలాండ్‌‌ను ఓడించింది. తొలుత స్పిన్నర్లు కట్టడి చేయడంతో న్యూజిలాండ్‌‌ 50 ఓవర్లలో 7 వికెట్లకు 251 రన్స్ మాత్రమే చేసింది.

 అనంతరం కెప్టెన్ రోహిత్ శర్మ (83 బాల్స్‌‌లో 7 ఫోర్లు, 3 సిక్సర్లతో 76) ముందుండి నడిపించడంతో భారత్​ ఆరు వికెట్లు కోల్పోయి మరో ఓవర్‌‌‌‌ మిగిలుండగానే లక్ష్యాన్ని అందుకుంది. జట్టును గెలిపించిన రోహిత్‌‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. ఏడాది కిందటే టీ20 వరల్డ్ కప్ నెగ్గిన ఇండియా ఇప్పుడు మరో ఐసీసీ ట్రోఫీతో తన ఖ్యాతిని పెంచుకుంది. ఐసీసీ టోర్నమెంట్లలో  భారత్​కు మొత్తంగా ఇది ఏడో టైటిల్‌‌. 

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies