14 వ తేదీ మనకు హోలీ వరుసగా మూడు రోజులు సెలవులు
తెలంగాణ Telangana News భారత్ ప్రతినిధి : హోలీ అంటే రంగుల పండుగ ఈ ఏడాది ఈ పండుగను ఎప్పుడు జరుపుకోవాలో అన్న విషయాన్ని పండితులు తేల్చేశారు. మార్చి 14 శుక్రవారం రంగుల పండుగను ( హోలీ ) జరుపుకోవాలని పండితులు సూచిస్తున్నారు. ఇక ఆతరువాత మరో రెండు రోజులు కూడా సెలవులు రావడంతో జనాలు హోలీ సంబరాలను గ్రాండ్ గా చేసుకునేందుకు సిద్దమవుతున్నారు.
దేశ వ్యాప్తంగా రంగుల పండుగ జనాలు రడీ అవుతున్నారు. రంగుల పండుగ అంటే అదేనండి హోలీ. ఈ ఏడాది ( 2025) హోలీ పండుగ మార్చి 14 వ తేది శుక్రవారం జరుపుకోవాలని పండితు సూచిస్తున్నారు. రంగు రంగుల పండుగను జరుపుకుంటున్నారు. ఇక హోలీ పండుగ తరువాత జనాలు ఫుల్ కుషీగా ఉండేందుకు కూడా సిద్దమవుతున్నారు. ఎందుకంటే హోలీ తరువాత వరుసగా రెండు రోజులు సెలవులు వచ్చాయి. హోలీ పండుగ శుక్రవారం కాగా.. శనివారం.. ఆదివారం సెలవులు రావడంతో ఈ ఏడాది బారీగా సంబరాలు చేసుకునేందుకు సిద్దమవుతున్నారు.