మహిళా సంఘాలకు ఆర్టీసీ అద్దె బస్సులు ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
తెలంగాణ Telangana News భారత్ ప్రతినిధి : ఆర్టీసీ అద్దె బస్సులపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మహిళా సంఘాలకు ఆర్టీసీ అద్దె బస్సులను కేటాయిస్తూ ప్రభుత్వం మంగళవారం(మార్చి 4, 2025) ఉత్తర్వులు జారీ చేసింది. తొలి విడతలో 150 మహిళా సంఘాలకు బస్సులు కేటాయిస్తున్నట్లు ఈ ఉత్తర్వుల్లో ప్రభుత్వం స్పష్టం చేసింది. త్వరలో మిగిలిన సంఘాలకు 450 ఆర్టీసీ అద్దె బస్సులు కేటాయించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది.