హైదరాబాద్‌ను దేశానికి రెండో రాజధాని చేయాలి ప్రకాశ్ యశ్వంత్ అంబేద్కర్
తెలంగాణ Telangana News భారత్ ప్రతినిధి : ఢిల్లీలో ఎయిర్ పొల్యూషన్, దేశ రక్షణను దృష్టిలో పెట్టుకుని హైదరాబాద్‌ను రెండో రాజధానిగా చేయాలని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ మనువడు ప్రకాశ్ యశ్వంత్ అంబేద్కర్ అన్నారు. పాకిస్తాన్, చైనాకు ఢిల్లీ చాలా దగ్గరలో ఉందని తెలిపారు. ఇలా ఉండటంతో దేశ రక్షణకు శ్రేయస్కరం కాదన్నారు. హైదరాబాద్ బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ‘హైదరాబాద్‌ను దేశ రెండో రాజధాని చేయాలి’అని కోరుతూ పింగిళి సంపత్ రెడ్డి అధ్యక్షతన సోమవారం సమావేశం జరిగింది. ఈ మీటింగ్‌కు ప్రకాశ్ అంబేద్కర్ చీఫ్ గెస్ట్‌గా హాజరై మాట్లాడారు. ‘‘హైదరాబాద్‌ను దేశ రెండో రాజధాని చేయాలి. సుప్రీం కోర్టు బెంచి ఏర్పాటు చేయాలి.