వరుణ్ వచ్చీ రాగానే వికెట్ ప్రమాదకర హెడ్ ఔట్
Sports News క్రీడా వార్తలు భారత్ ప్రతినిధి : 54 పరుగుల వద్ద ఆస్ట్రేలియా రెండో వికెట్ కోల్పోయింది. ప్రమాదకర ట్రావిస్ హెడ్ (39; 33 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) ఔటయ్యాడు. బౌండరీలతో విరుచుకు పడుతూ జోరు మీదున్న ట్రావిస్ హెడ్ (39)ను వరుణ్ చక్రవర్తి పెవిలియన్‌కు పంపాడు. బౌలింగ్‌కు వచ్చీ రాగానే వికెట్ తీసుకున్నాడు.
వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌లో తొమ్మిదో ఓవర్ రెండో బంతిని భారీ షాట్‌కు యత్నించి హెడ్ గిల్ చేతికి చిక్కాడు. దాంతో, భారత జట్టుకు ఉపశమనం లభించినట్టైంది. అంతకుముందు హెడ్ కౌంటర్ అటాక్‌తో భారత్‌పై ఒత్తిడి పెంచే ప్రయత్నం చేశాడు. హార్దిక్ పాండ్యా వేసిన నాలుగో ఓవర్‌లో ఫోర్, సిక్స్ బాదిన హెడ్ షమీ వేసిన ఐదవ నాలుగో ఓవర్‌లో హ్యాట్రిక్ ఫోర్లు రాబట్టాడు. మూడు, నాలుగు, ఐదు బంతులను వరుసగా బౌండరీకి తరలించాడు. దాంతో, ఆసీస్ స్కోర్ కాసేపు పరుగులు పెట్టింది.