ఎండలు మండుతున్నాయి మంచి నీళ్ల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే
తెలంగాణ Telangana News భారత్ ప్రతినిధి : ఎండా కాలం వచ్చింది. పిబ్రవరిలో ఎండలు మొదలవ్వగా శివరాత్రి దాటగానే సూర్యుడు సుర్రుమంటున్నాడు. ఇంకా ముందుంది ముసళ్ల పండగ అన్న చందంగా. భానుడి ప్రచండాన్ని తట్టుకోవాలి. ఎప్పుడో చేతులు కాలిన తరువాత ఆకులు పట్టుకొనేకంటే సమ్మర్ సీజన్ లో మంచినీళ్ల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంకా ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు ముందుజాగ్రత్త చర్యగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం.
ఎండాకాలం వచ్చేస్తోంది. పోయిన సంవత్సరం ఎండల సంగతి గుర్తుంది కదా. మరీ సూర్యుడు. ఎదురొచ్చేదాకా ఉండటం కంటే ఎండాకాలం పూర్తిగా రాకముందే కొన్ని జాగ్రత్తలని పాటించుకుంటూ ఉండాలి. ముందు జాగ్రత్తగా ఎండాకాలాన్ని ఎదుర్కొనే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.