టీమిండియా చేతిలో ఓడిన మరుసటి రోజే ఆస్ట్రేలియా కెప్టెన్ స్మిత్ షాకింగ్ డెసిషన్
Sports News క్రీడా వార్తలు భారత్ ప్రతినిధి : వన్డే ఫార్మాట్ కు మాత్రమే స్మిత్ రిటైర్ మెంట్ ప్రకటించాడు. టెస్ట్ క్రికెట్, టీ20 ఫార్మాట్స్లో స్టీవ్ స్మిత్ కొనసాగుతాడు. వన్డేల్లో రిటైర్మెంట్ ప్రకటించడంపై స్మిత్ స్పందిస్తూ రెండు వరల్డ్ కప్స్ గెలిచి ఎన్నో జ్ఞాపకాలను పోగేసుకున్నానని.. వన్డే ఫార్మాట్లో ఆడిన ప్రతి నిమిషం తనకు మధుర జ్ఞాపకంగా గుర్తుండిపోతుందని స్మి్త్ చెప్పాడు. 2027 వన్డే వరల్డ్ కప్కు నాయకత్వం వహించడానికి సమర్థులకు ఇది సరైన అవకాశమని.. వన్డే ఫార్మాట్ నుంచి తప్పుకోవడానికి ఇదే సరైన సమయంగా భావిస్తున్నానని తన రిటైర్మెంట్పై స్మిత్ వ్యాఖ్యానించాడు.