అమీర్పేట్ నుంచి అశోక్ నగర్ వరకు ఈ ప్రాంతాల్లో శనివారం ( 8న ) మంచి నీళ్లు బంద్
తెలంగాణ Telangana News భారత్ ప్రతినిధి : ఈ నెల 8న ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 వరకు నగరంలోని పలుచోట్ల నీటి సరఫరాలో అంతరాయం ఉంటుందని వాటర్బోర్డు అధికారులు తెలిపారు. బీహెచ్ఈఎల్ వద్ద నేషనల్ హైవే అథారిటీ నిర్మించిన ఫ్లై ఓవర్ పనులకు ఆటంకం కలగకుండా జలమండలి పీఎస్సీ పైపులైన్ ను వేరే చోటికి మారుస్తోంది. ఈ పనుల్లో భాగంగా అక్కడ 1500 ఎంఎం డయా పైపులైన్ జంక్షన్ పనులు చేపట్టనున్నారు.