Type Here to Get Search Results !

Sports Ad

చదువుకొమ్మని ట్యూషన్ కి పంపితే నువ్వు చేసిందేంట్రా: ఇంట్లో రూ. 2 లక్షలు ఎత్తుకెళ్ళి టీచర్ కి ఇచ్చాడు If You Send Me For Tuition To Study, What Did You Do He Stole Rs. 2 lakhs From Home And Gave It To The Teacher

చదువుకొమ్మని ట్యూషన్ కి పంపితే నువ్వు చేసిందేంట్రా: ఇంట్లో రూ. 2 లక్షలు ఎత్తుకెళ్ళి టీచర్ కి ఇచ్చాడు

తెలంగాణ Telangana News భారత్ ప్రతినిధి : ఈ జనరేషన్ పిల్లల ఆలోచనలు మన ఉహకండని రేంజ్ లో ఉంటున్నాయి వయసుకి మించిన పనులు చేసే పిల్లలు రోజురోజుకీ ఎక్కువైపోతున్నారు. చదువుకొమ్మని ట్యూషన్ కి పంపితే ఇంట్లో రూ. 2 లక్షలు ఎత్తుకెళ్ళి ట్యూషన్ టీచర్ కి ఇచ్చాడు ఓ కుర్రాడు. హైదరాబాద్ లోని జీడిమెట్లలో జరిగింది ఈ ఘటన. ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. ట్యూషన్ టీచర్ ఆగడటంతో కుర్రాడు ఇంట్లో దొంగతనం చేసినట్లు తెలుస్తోంది.

 ఇంట్లో దొంగతనం చేసి లక్షల రూపాయలు ట్యూషన్ టీచర్ కి ఇవ్వడమే కాకుండా ఇటీవల ఐఫోన్ కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది. టీచర్ ఐఫోన్ వద్దు, డబ్బులు కావాలని అడగటంతో ఐఫోన్ అమ్మి రూ. 2 లక్షలు ఇచ్చాడు ప్రబుద్దుడు. ఐఫోన్ అమ్మిన విషయం మొబైల్ షాప్ యజమాని తండ్రికి సమాచారం అందించటంతో విషయం బయటపడింది.

 కొడుకు నిర్వాకం చూసి అవాక్కయిన తండ్రి చేసేదేమిలేక పోలీసులను ఆశ్రయించాడు.అయితే పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవట్లేదని వాపోతున్నాడు తండ్రి. ట్యూషన్ టీచర్ పై చర్యలు తీసుకోవాలని హెచ్ఆర్సీకి ఫిర్యాదు చేశాడు తండ్రి. 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies