Type Here to Get Search Results !

Sports Ad

తిరుమల భక్తులకు గుడ్ న్యూస్ ప్రతి గురువారం చర్లపల్లి నుంచి తిరుపతికి స్పెషల్ రైలు Good News For Tirumala Devotees, Special Train From Cherlapalli To Tirupati Every Thursday

తిరుమల భక్తులకు గుడ్ న్యూస్ ప్రతి గురువారం చర్లపల్లి నుంచి తిరుపతికి స్పెషల్ రైలు

తెలంగాణ Telangana News భారత్ ప్రతినిధి : సమ్మర్ హాలిడేస్ లో విహార యాత్రలకు వెళ్లే ప్రయాణికుల కోసం దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. ముఖ్యంగా తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లాలనుకునే భక్తుల కోసం సమ్మర్ స్పెషల్ ట్రైన్స్ నడపనున్నట్లు ప్రకటించింది. వేసవి సెలవులు కావడంతో తిరుమలకు వెళ్లే భక్తుల డిమాండ్ పెరగడంతో ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు తెలిపింది. మొత్తం ఎనిమిది ప్రత్యేక రైళ్లను సమ్మర్ కోసం ఏర్పాటు చేసినట్లు ప్రకటించింది. 

 ప్రతి గురువారం సాయంత్రం 4.30 గంటలకు చర్లపల్లి నుంచి తిరుపతికి స్పెషల్ ట్రైన్ బయలుదేరనుంది. మే 8వ తేదీ నుంచి 29 వ తేదీ వరకు స్పెషల్ సర్వీసు (ట్రైన్ నెం.07257) ట్రైన్ ప్రతి గురువారం తిరుపతికి బయల్దేరుతుంది. 

 ఇక తిరుగు ప్రయాణానికి తిరుపతి నుంచి సికింద్రాబాదు వరకు మరో ప్రత్యేక రైలును ఏర్పాటు చేశారు. ప్రతి శుక్రవారం మే 9 నుంచి 30 తేదీ వరకు తిరుపతి -సికింద్రాబాద్ స్పెషల్ సర్వీసు (ట్రైన్ నెం.07258) అందుబాటులో ఉంటుంది. అంటే గురువారం ట్రైన్ నెం.07257 సర్వీసు వెళ్తుండగా, శుక్రవారం ట్రైన్ నెం.07258 తిరుపతి నుంచి బయలుదేరుతుంది. 

 ఈ ట్రైన్ లు సనత్ నగర్, లింగంపల్లి, వికారాబాద్, తాండూర్, యాద్గిర్, కృష్ణా, రాయిచూర్, మంత్రాలయం, ఆదోని, గుంతకల్, గుత్తి, తాడిపత్రి, ఎర్రగుంట్ల, కడప, రాజంపేట్, కోడూర్, రేణిగుంట మొదలైన రూట్లలో ఈ స్పెషల్ ట్రైన్స్ నడుస్తాయి.


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies