Type Here to Get Search Results !

Sports Ad

సెలవుల్లో పిల్లల్ని స్విమ్మింగ్ ఫూల్ కు పంపిస్తున్నారా ఈ జాగ్రత్తలు తీసుకోండి పేరంట్స్ Parents, Take These Precautions If You Are Sending Your Children To The Swimming Pool During The Holidays.


 సెలవుల్లో పిల్లల్ని స్విమ్మింగ్ ఫూల్ కు పంపిస్తున్నారా ఈ జాగ్రత్తలు తీసుకోండి పేరంట్స్

Health News భారత్ ప్రతినిధి : ఎండాకాలం వచ్చింది. బడి  పిల్లలు సెలవులతో ఎంజాయ్ చేస్తున్నరు. ఇలాంటి టైంలో చాలామంది పిల్లలు ఈత కోసం పరుగులు తీస్తరు. పల్లెల నుంచి పట్టణాల వరకు కాల్వలు, బావులు. చెరువులు, స్విమ్మింగ్ పూల్స్ ఉన్నాయి. ఈత కొట్టేసమయంలో చాలామంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నరు. అయితే, ప్రమాదాలు జరగకుండా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలి. పెద్దల పర్యవేక్షణలోనే పిల్లలకు ఈత నేర్పించాలి. ఈ విషయంలో నిపుణులు చెబుతున్న సూచనలు ఇవి.

నీళ్లల్లోకి దిగే ముందు..

నీళ్లలోదిగే ముందు ఎలాంటి ఆహారం తీసుకోకూడదు. ఒకవేళ ఏదైనా తింటే రెండు గంటల తర్వాత ఈతకు వెళ్లాలి. చెవి, ముక్కులోకి నీళ్లు పోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈత కొట్టేటప్పుడు కళ్లకు ప్రత్యేక జాగ్రత్తలు అవసరం. ప్రత్యేక దుస్తులతో పాటు తల వెంట్రుకలు కప్పి ఉందేలా హెడ్ క్యాప్​ వాడాలి. ఈత కొట్టిన తర్వాత ఫ్రూట్ జ్యూస్​ లు  తీసుకోవడం మంచిది. 

ప్రమాదం జరిగినప్పుడు.. 

ప్రమాదవశాత్తు నీటిలో మునిగిన వాళ్లను బయటకు తీసిన వెంటనే శ్వాస సక్రమంగా అందేలా చేయాలి. పిల్లలు నీళ్లు తాగితే పొట్ట, ఛాతిపై నెమ్మదిగా ఒత్తిడి పెంచుతూ. కుడి వైపునకు తిప్పి పడుకోబెట్టాలి. బాధితుడి నోట్లోకి గాలి అందించే ప్రయత్నం చేయాలి. నీట మునిగిన వాళ్ల శరీరం చల్లబడే ప్రమాదం ఉంది. కాబట్టి వెంటనే వేడిగా ఉండే ప్రాంతానికి లేదా డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లాలి.

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies