Type Here to Get Search Results !

Sports Ad

తాండూర్ డిఎస్పి పై చర్యలు తీసుకొని వెంటనే సస్పెండ్ చేయాలి Action should be taken against the Tandoor DSP and he should be suspended immediately

తాండూర్ డిఎస్పి పై చర్యలు తీసుకొని వెంటనే సస్పెండ్ చేయాలి

బషీరాబాద్ భారత్ న్యూస్ ప్రతినిధి : అక్రమ అరెస్టులకు నిరసనగా బషీరాబాద్ మండల కేంద్రం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం ముందు నిరసన వ్యక్తం చేయడం జరిగింది.ఈ సందర్భంగా  ,సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు k. శ్రీనివాస్,   ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ హక్కుల పోరాట సంఘం  కొత్తూరు చంద్రయ్య, తెలంగాణ రాష్ట్ర ఎం హెచ్ పి ఎస్ మైనార్టీ అధ్యక్షులు  అబ్దుల్ వాహబ్ కెవిపిఎస్ జిల్లా సహాయ కార్యదర్శి వై సురేష్ మాట్లాడుతూ.

 బెల్కటూర్  నిందితులని అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారి సొంత గ్రామం బెల్కటూరు దళితులకు ఆలయ ప్రవేశం లేకపోవడం,దళితులు పెళ్లి చేసుకొని భారత్ నిర్వహిస్తున్న సమయంలో అగ్రకులాస్తులు అడ్డుకోవడం చాలా దుర్మార్గమని హెచ్చరించారు. తాండూర్ డిఎస్పి కి పశువుల తల పైన ఉన్న ప్రేమ దళితులపై లేకపోవడం దుర్మార్గమని అగ్రకుల పెతిందారులతో కుమ్మక్కై దళితుల కుటుంబాలకు అన్యాయం చేస్తున్న డిఎస్పిని వెంటనే సస్పెండ్ చేయాలని  డిమాండ్  చేశారు.

 తెలంగాణ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సొంత జిల్లాలోనె,కుల వివక్ష  అంటరానితనం,దళితులపై దాడులు జరగడం సిగ్గు చేటు అని ఇప్పటికైనా తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారు జిల్లా కలెక్టర్ గారికి జిల్లా ఎస్పీ గారికి ఆదేశాలు జారీ చేసి నిందితులు వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నాము.తాండూర్ మండలం,బెల్కటూరు* గ్రామానికి చెందిన దళిత యువకుడు వినయ్ కుమార్ మే నెల 18 న వివాహం చేసుకొని అదే రోజు భారత్ ఊరేగింపు చేస్తున్న సందర్బంలో దళిత పెళ్లి కుమారుని పెండ్లి భరత్ ఊరేగింపు అడ్డుకొని,దళితులపై దాడి చేసిన, దళిత పెళ్లి కుమారుని పెండ్లి భరత్ ఊరేగింపు అడ్డుకొని,దళితులపై దాడి చేసిన అగ్రకుల కులదూహంకారులు, పెత్తందార్లను వెంటనే అరెస్ట్ చెయ్యాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

 దేశానికి స్వాతంత్రం వచ్చి 78 సం|| రాలు అవుతున్న, మెరిసిపోతున్న తెలంగాణ అని రేవంత్ రెడ్డి ఇంకో వైపు చెబుతున్న కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ప్రత్యేకంగా మన గౌరవ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గడ్డం ప్రసాద్ గారు పుట్టిన సొంత గ్రామంలో దళితులు వివాహం భరత్ ఊరేగింపు చేసుకొని దురదృష్టం ఉంది.దళితులకు రాజ్యాంగం కల్పించిన ఆర్టికల్ 14 ప్రకారం,సమానత్వం, 17 ప్రకారం కువివక్ష నిషేద్దాం.

 21ప్రకారం కల్పించిన వ్యక్తిగత స్వేచ్ఛ, జీవించే హక్కులను అగ్రకుల పెత్తందార్లు కాలారాస్తున్న ప్రభుత్వం,పోలీస్ అధికారులు పట్టించుకోక పోవడం విడ్డురం అన్నారు.ఘటన జరిగి 20 రోజులు గడుస్తున్నా నేటికీ ఆ గ్రామాన్ని  ,సబ్ కలెక్టర్ సందర్శించక పోవడంపై అధికారులపై పలు అనుమానాలకు తావు ఇస్తుందన్నారు.ఆ గ్రామంలో దళితులకు నేటికీ దేవాలయ ప్రవేశం కులవివక్ష,అంటరానితనందళితులపై దాడులు, దౌర్జన్యం నిరంతరం కొనసాగుతున్న ఆ దళితులు ఎన్నిసార్లు సంబందిత అధికారులకు పిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదు.ఇప్పటికైనా జిల్లా కలెక్టర్,ఎస్పి ఆ గ్రామాన్ని వెంటనే సందర్శించి బాధితులను పరామర్శించి దళితులను దేవాలయం ప్రవేశం కల్పించి,
నిందితులను అరెస్ట్ చెయ్యాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేశార.

 ఇప్పటికైనా తాండూర్ డిఎస్పి గారు తక్షణమే అరెస్ట్ చేయకపోతే కేవీపీస్,దళిత,ప్రజా సంఘాల ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తామని  హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ తాండూర్ పట్టణ అధ్యక్షులు బలరాం పట్టణ ఎమ్మార్పీఎస్ అధికార ప్రతినిధి జై  నరేష్ డి రాజు కుమార్ ఎమ్ హెచ్ పి ఎస్ తాండూర్ పట్టణ అధ్యక్షులు సాదిక్  నాయకులు సమియోధిన్ బసరాజ్ మండల ఎం హెచ్ పి ఎస్ అధ్యక్షులు అమీర్ కార్యదర్శి ఖదీర్ ప్రజాసంఘాల నాయకులు విజయ్ ఆశప్ప మరియు తదితరులు పాల్కొన్నారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies